Veera Dheera Soora Day 5 Collection : ఫ్యాన్స్‌కు విక్రమ్ రంజాన్ ట్రీట్.. వీర ధీర శూరకు ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ సూపర్‌స్టార్ విక్రమ్ హిట్ ముఖం చూసి చాలా ఏళ్లే అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయన చేసిన చిత్రమే వీర ధీర శూర. ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజ్ సందర్భంగా కొన్ని లీగల్ సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఎట్టకేలకు విడుదలైంది. అయితే అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో చిత్ర యూనిట్ షాక్ అవుతోంది. ఈ నేపథ్యంలో 5వ రోజు వీర ధీర శూర ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:
ఈ సినిమాలో విక్రమ్ సరసన దుషార విజయన్ హీరోయిన్‌గా అలరించారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, 30 ఇయర్స్ పృథ్వీ, సిద్ధిఖీ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందజేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ చిత్రాన్ని దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. వీర ధీర శూరకు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 31 కోట్ల షేర్.. రూ. 64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

తొలిరోజు సగం షోస్ క్యాన్సిల్ కావడంతో ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడింది. అయినప్పటికీ వీకెండ్‌ను క్యాష్ చేసుకుంటూ విక్రమ్ బాగానే హోల్డ్ చేస్తున్నాడు. శని, ఆదివారాల్లో బాగానే వసూళ్లను రాబట్టాడు విక్రమ్. ఈ నేపథ్యంలో రంజాన్ పర్వదినం నాడు వీర ధీర శూర ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో చూస్తే. ఐదో రోజు మార్నింగ్ షోలకు 19.36 శాతం, మ్యాట్నీలకు 39.37 శాతం, ఫస్ట్ షోలకు 40.86 శాతం, సెకండ్ షోలకు 42.50 శాతం చొప్పున ఓవరాల్‌గా 35.32 శాతం మేర ఆక్యూపెన్సీ నమోదైంది.
తమిళ ప్రేక్షకుల నుంచి వీర ధీర శూరకు మంచి ఆదరణ దక్కుతోంది. చెన్నైలో 484, బెంగళూరులో 201, కోయంబత్తూరులో 180, మధురైలో 104 షోల చొప్పున ప్రదర్శితమయ్యాయి. ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ సినిమాకు ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆక్యూపెన్సీ బాగుంది. ఐదో రోజు వీర ధీర శూర ప్రపంచవ్యాప్తంగా రూ.4.30 కోట్ల చొప్పున వసూళ్లు సాధించింది. తమిళంలో రూ.4 కోట్లు, తెలుగులో రూ. 30 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఐదు రోజుల వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.26.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో 23.3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.2 కోట్లు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.
తద్వారా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కోలీవుడ్ చిత్రాల్లో వీర ధీర సూర నాలుగో స్థానంలో నిలిచింది. డ్రాగన్ రూ.102.10 కోట్లతో ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉండగా, విదాముయార్చి (81.58 కోట్లు), మద గజ రాజా (రూ.48.70 కోట్లు), వీర ధీర శూర కంటే ముందున్నాయి. మంగళవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో విక్రమ్ ఎలాంటి మేజిక్ చేస్తాడోనని ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











