Veera Dheera Soora Day 6 Collection : పనిచేయని విక్రమ్ మేజిక్.. షాకిచ్చేలా వీర ధీర శూర వసూళ్లు, ఎన్ని కోట్లంటే

విడుదల రోజు ఎన్నో ఆటుపోట్లను, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొన్న చియాన్ విక్రమ్ మూవీ వీర ధీర సూర బాక్సాఫీస్ వద్ద తన పరుగును డల్‌గానే ప్రారంభించింది. తొలిరోజు అత్యంత దారుణంగా ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ తర్వాత పుంజుకుని నిలబడింది. వీకెండ్, రంజాన్, ఉగాది పండుగలు కలిసి రావడంతో వీర ధీర శూర బాగానే హోల్డ్ చేసింది. ఈ నేపథ్యంలో 6వ రోజు విక్రమ్ నటించిన సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

వీర ధీర శూర‌కు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రయోగాల జోలికి పోకుండా యాక్షన్, కమర్షియల్ ఫార్ములాతో, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా ఈ చిత్రాన్ని చేశారు విక్రమ్. రంజాన్, ఉగాది పండుగల కానుకగా మార్చి 27న వీర ధీర శూర చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే న్యాయపరమైన సమస్యల కారణంగా వీర ధీర శూర విడుదల ఆలస్యమై మధ్యాహ్నం వరకు షోలు క్యాన్సిల్ అయ్యాయి.

chiyaan vikram s Veera Dheera Soora Day 6 Box Office Collection worldwide report

వీర ధీర శూరలో విక్రమ్ సరసన దుషార విజయన్ హీరోయిన్‌గా నటించారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, 30 ఇయర్స్ పృథ్వీ, సిద్ధిఖీ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత సారథ్యం వహించారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ చిత్రాన్ని దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. వీర ధీర శూరకు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 31 కోట్ల షేర్.. రూ. 64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

తొలిరోజు ఓపెనింగ్స్ తగ్గినప్పటికీ తర్వాత పుంజుకున్న వీర ధీర శూర ఐదు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.23.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. 2025లో విడుదలైన ముర్ముర్ , గేమ్ ఛేంజర్, కాదలిక్క నెరమిల్లయై తదితర తమిళ చిత్రాలను కలెక్షన్ల పరంగా వీర ధీర శూర అధిగమించింది. 2025లో విడుదలైన తమిళ చిత్రాల్లో డ్రాగన్ (రూ.88.38 కోట్లు) టాప్‌లో ఉండగా విదాముయార్చి రూ.78.58 కోట్లు, మద గజ రాజా రూ.47.57 కోట్లు టాప్‌ 3లో ఉన్నాయి.

వీకెండ్ , పండగ సీజన్ ముగిసినప్పటికీ వీర ధీర శూర బాగానే హోల్డ్ చేసింది 6వ రోజు ఉదయం ఆటలకు 14.38 శాతం, మ్యాట్నీలకు 25.28 శాతం, సెకండ్ షోలకు 23.93 శాతం, సెకండ్ షోలకు 30.62 శాతం చొప్పున ఓవరాల్‌గా 23.55 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. చెన్నైలో 430 షోలు, బెంగళూరులో 197 షోలు, మధురైలో 105, కోయంబత్తూరులో 156 షోలు పడ్డాయి.

మంగళవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2.4 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. దీంతో కలిపి ఇప్పటి వరకు వీర ధీర శూర సినిమా రూ.31 కోట్లు అందుకుంది. ఇందులో ఇండియా వైడ్ రూ.27.6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.4 కోట్ల చొప్పున కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా రికవరీ చేయాల్సిన మొత్తం భారీగానే ఉండటంతో రానున్న రోజుల్లో విక్రమ్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X