మహేష్,రామ్ చరణ్ లాగే... అల్లు అరవింద్
హైదరాబాద్ : యూత్ లో రామ్‌చరణ్, మహేష్‌బాబుకు ఎంత ఆదరణ ఉందో.. పిల్లల్లో చోటా భీమ్‌కు అంతే ఆదరణ ఉంది అన్నారు అల్లు అరవింద్. గత సంవత్సరం వెండితెరపై తన సాహసాలు, తెలివితేటలతో పిల్లలను అలరించిన చోటా భీమ్ మళ్లీ వస్తున్నాడు. 'చోటా భీమ్' పరంపరలో రెండో చిత్రం 'చోటా భీమ్ అండ్ ద థ్రోన్ ఆఫ్ బాలి' మే 3న విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాబోతున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని గురువారం ఉదయం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
అలాగే అల్లు అరవింద్ మాట్లాడుతూ ''విదేశాల్లో మిక్కీమౌస్, డొనాల్డ్‌డక్ పాత్రలు చూసినప్పుడు మన దేశ సంస్కృతికి తగ్గట్లు ఇలాంటి పాత్రలు ఉంటే బాగుండు అనిపించేది. చోటా భీమ్‌తో ఆ కోరిక తీరింది. దీన్ని రూపొందించింది మనవాళ్లు కావడం గర్వంగా ఉంది అన్నారు. రాజీవ్ చిలక స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, గ్రీన్ గోల్డ్ పిక్చర్స్ వారు ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. దాదాపు 50 స్క్రీన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. అంచనాలను చిత్రం ఖచ్చితంగా అందుకుంటుందని చెప్తున్నారు. సమీర్ జైన్ మరో నిర్మాత.
''ఈ చిత్రానికి సునీల్ కౌశక్ అందించిన సంగీతం పిల్లలను ఆకట్టుకొంటుంది. చోటా భీమ్‌కు నాలుగు కోట్ల మంది బాల అభిమానులున్నారు. చోటాభీమ్ పరంపరలో రెండో చిత్రం తీయడానికి ఇదే కారణమ''న్నారు దర్శకుడు రాజీవ్ చిల్క. ''చోటా భీమ్ మొదటి సినిమా విజయవంతమైంది. ఈ సినిమా కూడా ఈ వేసవిలో చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచుతుంది'' అన్నారు నిర్మాత సమీర్ జైన్.


Click it and Unblock the Notifications












