Oppenheimer Advance booking హాట్ కేకుల్లో టికెట్ల అమ్మకాలు..అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
హాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓపెన్‌హిమెర్ (Oppenheimer). హిస్టారికల్ బయోగ్రఫికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతోపాటు ఇండియాలో భారీగా రెస్సాన్స్ లభిస్తున్నది. ఇండియాలో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. 2023 సంవత్సరంలో మోస్ట్ పాపులర్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
ఓపెన్‌హిమెర్ (Oppenheimer) సినిమా విషయానికి వస్తే.. కాయ్ బర్డ్, మార్టిన్ జే షెర్విన్ రాసిన అమెరికన్ ప్రోమెథియస్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని ఎమ్మా థామస్, ఛార్లెస్ రోవెన్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా అందించారు. రాబర్ట్ జే, క్యాథరీన్, లెస్లీ గ్రోవ్స్, లెవీస్ స్ట్రాస్, ఎర్నెస్ట్ లారెన్స్ తదితరులు నటించారు.

ఓపెన్‌హిమెర్ (Oppenheimer) సినిమా భారీ రెస్పాన్స్ కనిపిస్తున్నది. దర్శక, నిర్మాత క్రిస్టఫర్ నోలన్‌కు ఇండియన్ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే భారీ స్పందన లభించింది. సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దాంతో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అయ్యాయి.
ఇండియాలోని నేషనల్ చైన్స్ థియేటర్‌లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఊహించని రీతిలో నమోదైంది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. 1.33 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇటీవల రిలీజైన హాలీవుడ్ సినిమాల్లో ఓపెన్‌హిమెర్ (Oppenheimer) టికెట్ల అమ్మకాలు రికార్డును క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి.
ఓపెన్‌హిమెర్ (Oppenheimer) సినిమా నేషనల్ చైన్స్ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. పీవీఆర్, ఐనాక్స్ స్క్రీన్లలో భారీ రెస్పాన్స్ కనిపించింది. పీవీఆర్‌లో 70 వేలకుపైగా టికెట్లు, ఐనాక్స్‌లో 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక సినీ పోలీస్‌లో 24 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో సుమారుగా 1.34 కోట్ల మేర టికెట్లు అమ్మకాలు జరగడం విశేషంగా మారింది.

ఓపెన్‌హిమెర్ (Oppenheimer) రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల అమ్మకాల విషయానికి వస్తే.. పీవీఆర్‌లో 61 వేల టికెట్లు, ఐనాక్స్‌లో 31 వేల టికెట్లు, సినీ పోలీస్ థియేటర్స్‌లో 20 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. రెండో రోజు 1.12 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం.
ఓపెన్‌హిమెర్ (Oppenheimer) మూడో రోజు టికెట్ల అమ్మకాల వివరాల్లోకి వెళితే ఊహించిన స్పందన కనిపించింది. పీవీఆర్‌లో 45000 టికెట్లకుపైగా, ఐనాక్స్‌లో 23000 టికెట్లకుపైగా, సినీ పోలీస్‌లో 15000 టికెట్లకుపైగా అమ్ముడుపోయాయి. మూడో రోజు 83000 టికెట్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.
ఓపెన్‌హిమెర్ (Oppenheimer) తొలి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద రికార్లు కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సాధించింది. ఈ చిత్రం మూడు రోజుల్లో 3,30,000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం 14 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు అయ్యాయి. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











