టెనెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. కరోనా ఉన్నా తగ్గలేదు, ఇంకా ఎంత రావాలంటే?
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగాలను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇక సినిమాలు ఇప్పట్లో రానట్లే అని అనుకుంటున్న తరుణంలో అందరిని ఆశ్చర్య పరిచే విధంగా టెనెట్ సినిమాను రిలీజ్ చేశారు. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 26 యూకే లాంటి కొన్ని కంట్రీస్ లలో భారీ స్థాయిలో విడుదలైంది.

వీకెండ్ కలెక్షన్స్..
ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించినంతగా రికార్డులు ఏమి సృష్టించలేదు. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ లో ఈ స్పై ఫిల్మ్ 53 మిలియన్ డాలర్లను రాబట్టగలిగింది. అంటే మన ఇండియం కరెన్సీలో 387కోట్లు. అయితే ఈ కరోనా కష్ట కాలంలో ఆ మాత్రం అయినా వసూళ్లను అందుకోగలిగింది అంటే గొప్ప విషయమనే చెప్పాలి.

ప్రమోట్ చేసిన టామ్ క్రూజ్
హాలీవుడ్ లో టాప్ క్రూజ్ వంటి స్టార్స్ కూడా సినిమాను థియేటర్స్ లో వీక్షించి తన దైన శైలిలో ప్రమోట్ చేశారు. ఇక సినిమాకు రేటింగ్ కూడా పాజిటివ్ గా రావడంతో సినిమాపై మిగతా దేశాల్లో కూడా అంచనాలు పెరుగుతున్నాయి. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ లో మూడవ ప్రపంచాన్ని ఆపాలనే కథతో సినిమాను తెరకెక్కించారు.

ఇంకా ఎంత రావాలి అంటే..
జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికీ వంటి స్టార్స్ నటించిన టెనెట్ సినిమాను వార్నర్ బ్రదర్స్ నిర్మించింది. ఇక సినిమా బడ్జెట్ 225మిలియన్ డాలర్లు. అంటే ఇప్పుడు వచ్చింది కేవలం 53 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇంకా లాభల్లోకి రావాలి అంటే 180మిలియన్ డాలర్లు రాబట్టాలి. ఇక త్వరలో ఇతర దేశాల్లో కూడా సినిమాను విడుదల చేస్తారు కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం లేకపోలేదు.

పాజిటివ్ హైప్ క్రియేట్ చేశారు
అసలు ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ పై మొదటి నుంచి కూడా చాలా అనుమానాలు వచ్చాయి. ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని ఎవరు అనుకోలేదు. ఇక టెనెట్ సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా దెబ్బ కొట్టడంతో కొన్ని రోజుల వరకు ఓపిక పట్టారు. ఇక మొత్తనికో కొన్ని కంట్రీస్ లలో విడుదల చేసి దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేశారు. మరి ఇండియాలో ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











