The Odyssey Booking: క్రిస్టఫర్ నోలన్ సంచలన రికార్డు.. ఒక్క రోజులోనే ఏడాది ముందే అడ్వాన్స్ బుకింగ్ హౌస్‌ఫుల్

ప్రపంచంలోనే దిగ్గజ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత క్రిస్టఫర్‌ నోలన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ది ఒడిస్సీ (The Odyssey). ఈ మూవీ కథను ప్రాచీన గ్రీక్ పద్యం ది ఒడిస్సీ నుంచి సంగ్రహించారు. ఇథాకా గ్రీక్ కింగ్‌ ఒడిస్సీగా మాట్స్ డామన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో టామ్ హాలండ్, అన్నే హాత్‌వే, జెండ్యా, లుపిటా న్యాంగోస్, రాబర్ట్ పాటిన్సన్, ఛార్లైజ్ థియోరాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు.

ఈ సినిమాను తన సొంత సినీ నిర్మాణ సంస్థ సింకాపీ ద్వారా నిర్మించారు. యూనివర్సల్ పిక్చర్స్ ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా జూలై 17, 2026 సంవత్సరలో రిలీజ్ కానున్నది. ఏడాది తర్వాత విడుదలయ్యే ఈ సినిమా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఆ రికార్డు వివరాల్లోకి వెళితే..

ఇథాకా గ్రీక్ రాజు ఒడిస్సీ సుదీర్ఘంగా సాగిన ట్రోజాన్ వార్ తర్వాత తన భార్య పెనెలోప్‌ను కలిసేందుకు ప్రయాణమవుతాడు. ఆ ప్రయాణంలో గ్రీకు మైథాలజీ ప్రకారం చెప్పబడిన దుష్ట శక్తులు సైక్లాప్, పాలీఫెమస్, ది సైరెన్స్‌తో సూర్య భగవానుడి కుమార్తెగా భావించే సిర్స్ తారసపడుతారు. వారిని అడ్డును ఎలా తొలగించుకొని భార్యను ఎలా కలిశాడు అనేది ఈ సినిమా కథ. గ్రీక్ రాజు జర్నీని ప్రతిష్టాత్మకంగా క్రిస్టఫర్ నోలన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

Christopher Nolan s The Odyssey advance Booking

ది ఒడిస్సీ సినిమా రిలీజ్‌కు సరిగ్గా ఏడాది ఉండగా.. అంటే జూలై 17 తేదీ 2025 రోజున అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఐమాక్స్ 70ఎంఎం బిగ్‌ స్క్రీన్స్‌లో ఐమాక్స్ వెర్షన్‌లో ప్రదర్శించే సినిమాకు సంబంధించిన టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమ్మకాలు జరిపారు. ఈ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే రికార్డు స్థాయిలో ఒకే రోజులు టికెట్లన్నీ అమ్ముడు పోవడం రికార్డుగా మారింది. దాదాపు ఒకే రోజులో నార్త్ అమెరికాలో 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది నార్త్ అమెరికా బాక్సాఫీస్ చరిత్రలో ఓ రికార్డు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఐమాక్స్ కాకుండా మిగితా వెర్సన్ టికెట్లు ఇప్పట్లో అమ్మడం కుదరదు. ఆ టికెట్లను రిలీజ్‌ సమయంలో కొన్ని రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తాం. అప్పుడే వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుందని నోలన్ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ వెల్లడించింది. దాంతో ఇప్పుడే బుక్ చేద్దామని ఆశించిన వారంతా నిరాశకు గురయ్యారు.

ది ఒడిస్సీ సినిమాను పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో నోలన్ చిత్రీకరించారు. ఒక సినిమాను ఇలా చిత్రీకరించడం హాలీవుడ్‌లో తొలిసారి. గతంలో కూడా ది డార్క్ నైట్, ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లర్, టెనెట్ లాంటి సినిమాలను ఐమాక్స్ వెర్షన్‌లోనే చిత్రీకరించడం తెలిసిందే. ఆప్పెన్‌హీమర్ సినిమా కూడా కొంత పార్ట్‌ ఐమాక్స్ వెర్షన్‌లో చిత్రకరించారని సినీ పండితులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, నోలన్ దర్శకత్వం వహించిన అప్పెన్‌హీమర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 995 మిలియన్ డాలర్లు అంటే 8600 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కోవిడ్ తర్వాత అత్యధికంగా వసూలు చేసిన 11వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X