twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RIPDilipkumar : లెజెండ్రీ నటుడి మృతితో తీవ్ర విషాదం... రాజకీయ సినీ దిగ్గజాల సంతాపం

    |

    ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా దిలీప్ కుమార్ జూన్ 29న ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన మరణం గురించి రాజకీయ సినీ దిగ్గజాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

     దిలీప్ కుమార్ అసలు పేరు

    దిలీప్ కుమార్ అసలు పేరు

    దిలీప్ కుమార్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఈ నటుడి మరణం గురించి దిలీప్ కుమార్ కుటుంబ స్నేహితుడు ఫైజల్ ఫారూకి ఈ రోజు ట్విట్టర్‌లో సమాచారం ఇచ్చారు, దిలీప్ సాబ్ మాతో లేడని చాలా భారమైన హృదయంతో చెబుతున్నానని అంటూ ఆయన ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. ఆయన 11 డిసెంబర్ 1922 న జన్మించాడు.

    65 కి పైగా సినిమాల్లో

    65 కి పైగా సినిమాల్లో

    హిందీ సినిమాల్లో ఆయనను ఫస్ట్ ఖాన్ అని పిలుస్తారు. హిందీ సినిమాల్లో మెథడ్ యాక్టింగ్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. బొంబాయి టాకీస్ నిర్మించిన జ్వార్ భాటా చిత్రంలో 1944లో దిలీప్ కుమార్ తన నటనా రంగ ప్రవేశం చేశారు. దాదాపు ఐదు దశాబ్దాల నటనా జీవితంలో 65 కి పైగా సినిమాల్లో నటించారు.

    ప్రధాని స్పందిస్తూ

    ప్రధాని స్పందిస్తూ

    దిలీప్ కుమార్ మృతికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. "దిలీప్ సాహిబ్ ఎప్పుడూ సినిమాకి ఇతిహాసంగా గుర్తుండిపోతారు, ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంది, దీనివల్ల ప్రేక్షకులు ఆయన అనేక తరాలుగా ఆకర్షించారు. ఆయన ఉత్తీర్ణత మన సాంస్కృతిక ప్రపంచానికి నష్టమే అని అన్నారు. అతని కుటుంబానికి తన సంతాపం అని తెలిపారు. దిలీప్ కుమార్ మరణం తరువాత మోడీ తన భార్య సైరా భానుతో మాట్లాడి ఓదార్చారు. పీఎం సైరా భానుతో పది నిమిషాలు మాట్లాడి ఆమెను ఓదార్చారు.

     రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దిలీప్ కుమార్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ జీ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేశారు. ఇక భారతీయ సినిమాకు ఆయన చేసిన అసాధారణ సహకారం రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని అన్నారు.

     చిరంజీవి స్పందిస్తూ

    చిరంజీవి స్పందిస్తూ

    ఇక మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక యుగం ముగిసింది అని పేర్కొన్నారు. లెజెండ్ దిలీప్ కుమార్ మృతి మృతి వలన చాలా బాధపడుతున్నానని అన్నారు. భారతదేశం ఇప్పటివరకు చూసిన గ్రేటెస్ట్ యాక్టర్లలో ఒకరు, యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్ & నేషనల్ ట్రెజర్ అని ఆయన అన్నారు. అనేక దశాబ్దాలుగా ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసిన ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరారు.

    Recommended Video

    Nanda Kishore, Ushasri Exclusive Interview Part 4 | Narasimhapuram
    ఎన్టీఆర్ ఇలా

    ఎన్టీఆర్ ఇలా

    ఇక ఎన్టీఆర్ స్పందిస్తూ భారతీయ సినిమా వృద్ధికి దిలీప్ కుమార్ సాబ్ అందించిన సహకారం అమూల్యమైనది. రెస్ట్ ఇన్ పీస్ సార్. మిమ్మల్ని మిస్ అవుతామని అన్నారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ మీరు ఒక చరిత్ర... ఒక ప్రేరణ... అద్భుతమైన జీవితాన్ని గడిపినందుకు ధన్యవాదాలు # దిలీప్‌కుమార్ జి... రెస్ట్ ఇన్ పీస్ అని పేర్కొన్నారు.

    English summary
    Legendary Bollywood actor Dilip Kumar passed away on Wednesday (July 7). The actor was admitted to the intensive care unit (ICU) of Mumbai's Hinduja Hospital on June 30. now cinema celebrities Politicians Mourn Death of Legendary Actor Dilip Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X