శేఖర్ కమ్ములతో మారుతి క్లాష్..గెలుపు ఎవరిది?

By Srikanya

Clash between Maruthi and Shekar Kammula?
హైదరాబాద్: శేఖర్ కమ్ముల, మారుతి ఇద్దరూ స్టార్ హీరోలు లేకుండా హిట్ చిత్రాలు తీసి దర్శకులుగా తామేంటో ప్రూవ్ చేసుకున్నారు. వీరిద్దరి సినిమాలు భాక్సాఫీస్ వద్ద మే 1 పోటీపడనున్నాయి. ఈ నేపధ్యంలో చాలా ఆసక్తికరంగా ఇండస్ట్రీ మొత్తం ఏ చిత్రం సక్సెస్ అవుతుందనే విషయంపై రకరకాల చర్చలు చేస్తున్నారు. ఇద్దరూ పొటిన్షియల్ ఉన్న దర్శకులు కావటంతో ఈ పోటీ ఇంట్రస్టింగ్ ఉంది.

శేఖర్ కమ్ముల,నయనతార కాంబినేషన్ లో రూపొందిన థ్రిల్లర్ అనామిక, అల్లు శిరీష్ తో మారుతి చేస్తున్న ఫన్ ఎంటర్టైనర్ కొత్త జంట..ఇవే ఆ రెండు చిత్రాలు. ఇద్దరి చిత్రాల్లో స్టార్ హీరోలు లేకపోయినా ఎలా ఉంటాయి..చూడాలనే ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. ముఖ్యంగా ఇద్దరూ డైరక్టర్ ఓరియంటెడ్ చిత్రాలు తీసే వారు కావటం విశేషం.

అనామిక విషయానికి వస్తే...నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు

అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది.

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఇద్దరు స్వార్థపరులు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. మారుతి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రమిది. మారుతి మాట్లాడుతూ... నేను.. నా జీవితం ఇంకేమీ వద్దు. డబ్బుంటేనే జీవితం... అది లేకపోతే ఇంకేమీ లేదు. ఇలాంటి మనస్తత్వం వారిద్దరిదీ. అనుకోకుండా కలుసుకున్నారు.. మనసులు కలుపుకొన్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ జంట కథే మా 'కొత్తజంట' అన్నారు .

'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మారుతి. 'బస్‌స్టాప్‌', 'ప్రేమ కథాచిత్రమ్‌' సినిమాలు విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X