For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుమ్మురేపుతున్న RGV's Climax కలెక్షన్లు.. 24 గంటల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే!

    |

    కరోనా లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడిన నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ప్రయోగం ఆర్థికంగా సత్పలితాలను ఇస్తున్నది. ఇటీవల శ్రేయాస్ మీడియా యాప్‌లో ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో మియా మాల్కోవా నటించిన శృంగార భరిత చిత్రం ప్రేక్షకులను, సినీ అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే కలెక్షన్లపరంగా తొలి రోజు దుమ్మురేపినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే..

    రాంగోపాల్ వర్మ ప్రయోగం

    రాంగోపాల్ వర్మ ప్రయోగం

    దర్శకుడు రాంగోపాల్ వర్మ శివ సినిమా నుంచి సంచలన ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసిందే. సినిమా మేకింగ్‌లో సంప్రదాయ పద్దతులకు స్వస్తి చెబుతూ కొత్త తరహా విధానాల్లో సినిమాలు తీస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. తక్కువ బడ్జెట్‌, మామూలు కెమెరాతో ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.

    మియా మాల్కోవాతో శృంగార చిత్రం

    మియా మాల్కోవాతో శృంగార చిత్రం

    ఇక లాక్‌డౌన్‌లో అమెరికాకు చెందిన శృంగార తార మియా మాల్కోవాతో రూపొందించిన క్లైమాక్స్ చిత్రాన్ని శ్రేయాస్ ఈటీ యాప్‌లోని ఆర్జీవి థియేటర్‌లో శనివారం రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. గత 24 గంటల్లో ఊహించని విధంగా వసూళ్లు రాబట్టడం సినీ పరిశ్రమలో గేమ్ ఛేంజర్ అనే వర్మ ట్వీట్ చేశారు.

    ఓటీటీలో ధర ఎంతంటే..

    ఓటీటీలో ధర ఎంతంటే..

    శనివారం ఓటీటీలో రిలీజ్ చేసిన క్లైమాక్స్ చిత్రానికి రూ.100 టికెట్ ధరను నిర్ణయించారు. జీఎస్టీ ఇతర చార్జీలతోపాటు మొత్త కలిపి సుమారు రూ130 వరకు ధరగా నిర్ణయించారు. ఈ సినిమాకు తొలి 12 గంటల్లో 1,68,596 మంది చూశారు. ప్రేక్షకుల రియాక్షన్‌కు యాప్ కూడా క్రాష్ అయింది అంటూ వర్మ ట్వీట్ చేశారు.

    12 గంటల్లోనే 1.68 మంది

    12 గంటల్లోనే 1.68 మంది

    అయితే క్లైమాక్స్ సినిమా రిలీజ్‌కు ముందు వర్మ తన మూవీకి ఓపెనింగ్ డే రోజున రూ.50 లక్షలు వస్తాయని అంచనా వేశారు. కానీ 12 గంట్లలోనే 1.68 లక్షల మంది చూడటంతో అంతకంటే భారీగా వసూళ్లు నమోదయ్యాయి. తొలి 12 గంటల్లోనే రూ.1.6 కోట్లు వసూలు చేయడం విశేషంగా భావించాల్సిందే. ఇలాంటి కలెక్షన్లు సినిమా నిర్మాతలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే అంశాలుగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    Climax Movie Review And Rating
    24 గంటల్లో 3 కోట్ల రూపాయలు

    24 గంటల్లో 3 కోట్ల రూపాయలు

    క్లైమాక్స్ చిత్రం శ్రేయాస్ మీడియా యాప్‌లో భారీగా వసూళ్లను సాధించినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం 24 గంటల్లోనే సుమారు 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే వర్మ ఇంకా తుది వసూళ్లను ప్రకటించకపోవడంతో కచ్చితంగా తొలి రోజు కలెక్షన్లు ఎంత అనేది సందిగ్దంగా మారింది.

    English summary
    Climax movie has released in OTT app on June 7th. This movie get good response from audience from world wide. RGV movie collected 3 crores in 24 hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X