twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Cobra day 1 collections.. రికార్డు కలెక్షన్లతో విక్రమ్.. బాక్సాఫీస్‌పై కోబ్రా పంజా ఎంతంటే?

    |

    చియాన్ విక్రమ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్ అజయ్ జ్ఞాన‌ముత్తు కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోబ్రా చిత్రం ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్నది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి నటించిన ఈ చిత్రానికి సంబంధించిన తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

    తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ వివరాలు

    తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ వివరాలు


    ఇక కోబ్రా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 22 కోట్లు, సీడెడ్‌లో 9 కోట్లు, ఉత్తరాంధ్రలో 6 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 3.5 కోట్లు, గంటూరులో జిల్లాలో 4.40 కోట్లు, కృష్ణా జిల్లాలో 3.8 కోట్లు, నెల్లూరులో 2 కోట్లతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 54.7 కోట్ల బిజినెస్ జరిగింది.

    తమిళనాడు, ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    తమిళనాడు, ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్


    ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళనాడులో 20 కోట్లు, కేరళలో 1.25 కోట్లు, కర్ణాటకలో 5 కోట్లు, హిందీ 11 కోట్లు, ఓవర్సీస్‌లో 8 కోట్లుతో కలిపి మొత్తం 100 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 105 కోట్ల మేర లాభాలను సాధించాల్సి ఉంటుంది.

    భారీగా అడ్వాన్స్ బుకింగ్‌తో

    భారీగా అడ్వాన్స్ బుకింగ్‌తో


    కోబ్రా చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ భారీగా చేయడంతో అడ్వాన్సు బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. తమిళనాడులోని చెన్నైలో 70 శాతానికి పైగా, కోయంబత్తూరులో 75 శాతం, పాండిచ్చేరిలో 92 శాతం, త్రిచీ 93 శాతం, మిగితా ప్రాంతాల్లో 45 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది.

    తెలుగులో అక్యుపెన్సీ ఎలా ఉందంటే?

    తెలుగులో అక్యుపెన్సీ ఎలా ఉందంటే?


    ఇక కోబ్రా తెలుగు డబ్బింగ్ వెర్షన్ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 45 శాతం ఆక్యుపెన్సీ, బెంగళూరులో 24 శాతం, విజయవాడలో 40 శాతం, వరంగల్‌లో 35 శాతం, గుంటూరులో 45 శాతం, వైజాగ్‌లో 48 శాతం, ముంబైలో 44 శాతం, కాకినాడ 67 శాతం, రాజమండ్రిలో 60 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

    తమిళనాడులో రికార్డు కలెక్షన్లు

    తమిళనాడులో రికార్డు కలెక్షన్లు


    తమిళనాడులో కోబ్రా సినిమాకు భారీ ఒపెన్సింగ్ లభించాయి. తొలి రోజున సుమారు 12 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. తమిళనాడులో కోబ్రా నాలుగో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డును నమోదు చేసింది. అజిత్ వలిమై చిత్రం 36 కోట్లు, విజయ్ నటించిన బీస్ట్ 27 కోట్లు, కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం 20 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

    తెలుగు, కేరళ, కర్ణాటకలో

    తెలుగు, కేరళ, కర్ణాటకలో


    తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఒపెనింగ్స్ నమోదయ్యాయి. నైజాం, ఆంధ్రాలో కలిపి ఈ సినిమా 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేరళలో 2 కోట్లు, కర్ణాటకలో 3.5 కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. నైట్ షోలకు మంచి రెస్పాన్స్ ఉంటే ఈ వసూళ్లు మరింత పెరగడానికి ఛాన్స్ ఉంది.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా

    ఇక ప్రపంచవ్యాప్తంగా కోబ్రా చిత్రం ఓవర్సీస్‌లో కూడా మంచి రెస్సాన్ లభిస్తున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 20 నుంచి 25 కోట్ల మధ్య వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఇక ఈ వారాంతం లాంగ్ వీకెండ్ కావడంతో లాభాలకు చేరువయ్యే అవకాశం కూడా ఉండే పరిస్థితి కనిపిస్తున్నది.

    English summary
    Vikram's Cobra movie starts box office at flying start. Reports suggest that, This movie could be collects around 25 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X