Cocktail 2 Day 1 Box Office collection: కాక్‌టెయిల్ 2 కు భారీ ఓపెనింగ్స్.. రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?

Cocktail 2 Box Office collection: బాలీవుడ్ స్టార్‌లు షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కాక్‌టెయిల్ 2'. 2012లో విడుదలై ఘనవిజయం అందుకున్న 'కాక్‌టెయిల్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హోమీ అదాజానియా తెరకెక్కించిన ఈ సినిమాను దినేష్ విజన్, లవ్ రంజన్, ప్రతిమా ఆర్ విజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మించారు. ప్రత్యేక పాత్రలో సంజయ్ దత్ కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీతం అందించగా, సంతాన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. అమితాబ్ భట్టాచార్య పాటలకు సాహిత్యం అందించగా, అక్షర ప్రభాకర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా జూన్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ ఎంత? ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు అంచనా కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Cocktail 2 Box Office collection

ట్రేడ్ అంచనాల ప్రకారం, 'కాక్‌టెయిల్ 2' ను సుమారు రూ.95 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నటీనటుల పారితోషికాలు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులు కలిపి మొత్తం బడ్జెట్ దాదాపు రూ.150 కోట్లకు చేరినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్‌ల స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాను రూపొందించినట్లు సమాచారం. ఇక ఓటీటీ, శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ రైట్స్ రూపంలో సుమారు రూ.75 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా, ఓవర్సీస్ మార్కెట్ కలిపి ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.70 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.70 కోట్ల షేర్, సుమారు రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. అందుకే ట్రేడ్ వర్గాలు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ.150 కోట్ల గ్రాస్‌గా అంచనా వేస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల డేటా ప్రకారం.. కాక్‌టెయిల్ 2 సినిమా దేశవ్యాప్తంగా సుమారు 4,160 షోలలో ప్రదర్శించబడుతుంది. విడుదలైన తొలి రోజు మధ్యాహ్నం వరకు ఈ సినిమా రూ.2.29 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆక్యుపెన్సీ పరంగా చూస్తే, తొలి రోజు కాక్‌టెయిల్ 2 దేశవ్యాప్తంగా సగటున 18 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఉదయం షోలతో పోలిస్తే మధ్యాహ్నం, సాయంత్రం షోలకు ప్రేక్షకుల స్పందన కొంత మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్, హైప్స్ పరంగా కూడా 'కాక్‌టెయిల్ 2' భారీ కలెక్షన్లను నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా రూ. 5.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

ఇక హైదరాబాద్‌లో 212 థియేటర్లలో ప్రదర్శించబడుతుండగా దాదాపు 21 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా రూ.50 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా ట్రెండ్‌ను బట్టి చూస్తే సినిమా తొలిరోజు రూ. 12 కోట్ల నుంచి రూ.14 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే సుమారు రూ.15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమాకు వీకెండ్‌లో భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X