Cocktail 2 Day 2 Box Office collection: షాహిద్-రష్మిక మ్యాజిక్ వర్కౌట్.. ‘కాక్‌టెయిల్ 2'కి ఎన్ని కోట్లంటే?

Cocktail 2 Day 2 Box Office Collections: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కాక్‌టెయిల్ 2'. ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. 2012లో భారీ విజయాన్ని అందుకున్న 'కాక్‌టెయిల్' సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు హోమీ అదాజానియా తెరకెక్కించిన ఈ సినిమాను దినేష్ విజన్, లవ్ రంజన్, ప్రతిమా ఆర్ విజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో నటించారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఓపెనింగ్ కలెక్షన్లు ఎంత? 2 రోజు అంచన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

'కాక్‌టెయిల్ 2' సినిమాను దాదాపు 95 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఇందులో స్టార్ క్యాస్ట్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్, ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు కలిపి మొత్తం వ్యయం దాదాపు రూ.150 కోట్ల వరకు చేరిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్‌ల క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇక నాన్-థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ కనిపించింది. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, డిజిటల్ హక్కుల ద్వారా నిర్మాతలకు సుమారు 75 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.

Cocktail 2 Day 2 Expected Box Office Collection Worldwide Shahid Kapoor Rashmika s Rom-Com box office report

దీంతో థియేట్రికల్ రన్‌పై ఒత్తిడి కొంత మేర తగ్గినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఉంది. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ హక్కులు కలిపి ఈ సినిమా రైట్స్ సుమారు 70 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే సినిమా కనీసం రూ.70 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఓపెనింగ్ కలెక్షన్లు
భారీ అంచనాల మధ్య విడుదలైన కాక్‌టెయిల్ 2' మిక్స్డ్ టాక్ వచ్చినా విడుదలైన తొలిరోజు మంచి ఓపెనింగ్స్ అందుకుంది ఈ సినిమా. ట్రేడ్ వర్గాలు వెల్లడించిన లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 3,000కు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజే డబుల్ డిజిట్ మార్క్‌ను దాటేసింది. మొదటి రోజే రూ.13.50 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, రూ.16.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఆక్యుపెన్సీ పరంగా చూస్తే ఉదయం షోలతో పోలిస్తే సాయంత్రం, రాత్రి షోలకు ప్రేక్షకుల స్పందన గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మెట్రో నగరాలు, మల్టీప్లెక్స్ సెంటర్లలో ఈవెనింగ్,నైట్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగింది. ఇక ఇండియా గ్రాస్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో వచ్చిన ఆదాయాన్ని కలుపుకుని తొలి రోజు ఈ సినిమా రూ.20.20 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌ను నమోదు చేసింది. ఇందులో ఓవర్సీస్ మార్కెట్ల నుంచే దాదాపు రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'కాక్‌టెయిల్ 2 డే 2 అంచనా కలెక్షన్లు
తొలిరోజు భారీ రెస్పాన్స్ రాయడంతో కలెక్షన్స్ పెరుగుతాయనే నమ్మకం వచ్చింది. రెండో రోజు (శనివారం) కావడంతో ఈ రోజు కూడా కలెక్షన్లు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇండియాలో రెండో రోజు గ్రాస్ కలెక్షన్లు రూ.18 కోట్ల నుంచి రూ. 20 కోట్ల మధ్య వచ్చే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు రూ.35 కోట్లకు చేరుకునే అవకాశముంది. ఇక ఓవర్సీస్ కూడా రూ.3 కోట్ల వరకు కలెక్షన్లు అందుకునే అవకాశముందట. దీంతో రెండో రోజు అంచనా కలెక్షన్లు రూ. 40 కోట్లకు చేరుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా.. ఇక వీకెండ్ లో కూడా ఇదే జోరు కొనసాగితే సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X