Cocktail 2 Day 3 Box Office Collections: వీకెండ్ లో ‘కాక్‌టెయిల్ 2'దూకుడు.. రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?

Cocktail 2 Box Office Collections: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, స్టార్ హీరోయిన్ కృతి సనన్ లీడ్ రోల్స్ నటించిన నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'కాక్‌టెయిల్ 2'. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు హోమీ అదాజానియా దర్శకత్వం వహించగా, దినేష్ విజన్, లవ్ రంజన్, ప్రతిమా ఆర్ విజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో నటించారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు అందుకుంటుంది. ఈ నేపథ్యంలో కాక్‌టెయిల్ 2 మూవీ బడ్జెట్ ఎంత? నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఓపెనింగ్ కలెక్షన్లు ఎంత? ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది? 3 రోజు అంచనా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

'కాక్‌టెయిల్ 2'సినిమాను దాదాపు 95 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా, స్టార్ క్యాస్ట్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్, ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు కలిపి మొత్తం వ్యయం దాదాపు రూ.150 కోట్ల వరకు చేరిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్‌ల క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇక నాన్-థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే.. ఈ సినిమాకు మంచి డిమాండ్ కనిపించింది. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, డిజిటల్ హక్కుల ద్వారా నిర్మాతలకు సుమారు 75 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.

Cocktail 2 Day 3 Expected Box Office Collection Worldwide

ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఇండియా, ఓవర్సీస్ హక్కులు కలిపి సుమారు 70 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు సమాచారం. దీంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లోకి రావాలంటే కనీసం 70 కోట్ల రూపాయల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. ఈ టార్గెట్‌ను చేరుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మొదటి వీకెండ్‌లో సినిమా చూపిస్తున్న జోరును చూస్తే, ఈ లక్ష్యాన్ని అందుకునే అవకాశాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

'కాక్‌టెయిల్ 2' మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో జోరు కనబరుస్తోంది. తొలి రోజు 13.50 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, రెండో రోజు మరింత పుంజుకుని ఏకంగా 16.25 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. దీంతో రెండు రోజులకే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 29.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినమా రెండు రోజుల్లోనే 50.95 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. 2012లో విడుదలైన 'కాక్‌టెయిల్ 1' తొలి రెండు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 23.18 కోట్ల రూపాయాలు మాత్రమే వసూలు చేయగా, కాక్‌టెయిల్ 2 ఇప్పటికే 29.75 కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ రికార్డును అధిగమించింది.

బాబీ డియోల్ నటించిన 'బందర్', హాలీవుడ్ హారర్ మూవీ'ఒబ్సెషన్', ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'మైన్ వాపస్ ఆఊంగా', విక్రమ్ భట్ దర్శకత్వంలోని 'హాంటెడ్ 3డీ: ఎకోస్', తెలుగు సమంత నటించిన 'మా ఇంటి బంగారం ' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీలో ఉన్నప్పటికీ, 'కాక్‌టెయిల్ 2' తన స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఇక మూడో రోజు (ఆదివారం) 16 కోట్ల నుంచి 18 కోట్ల మధ్య నెట్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో తొలి వీకెండ్ ముగిసే నాటికి ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 45 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లో4 కోట్ల రూపాయాల వరకు కలెక్షన్లు అందుకునే అవకాశముందట. దీంతో మూడో రోజు అంచనా కలెక్షన్లు 60 నుంచి 65 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X