Cocktail 2 4 Days Box Office: 100 కోట్ల మైలురాయి వైపు కాక్‌టెయిల్ 2.. రష్మిక మందన్న మూవీకి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన కాక్ టెయిల్ 2 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. యూత్‌ఫుల్ కంటెంట్, బోల్డ్ సన్నివేశాలతో రూపొందిన A సర్టిఫికెట్ చిత్రానికి హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దినేష్ జైన్, లవ్ రంజన్, ప్రతిమా ఆర్ విజన్, అంకుర్ గార్గ్ నిర్మించారు. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించగా, శారద కర్కి జలోటా, పూజా ప్రేమ్ పాతీజా సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: ప్రీతమ్, ఎడిటర్: అక్షర ప్రభాకర్, సినిమాటోగ్రఫి: సంతాన కృష్ణన్ రవిచంద్రన్, లిరిక్స్: అమితాబ్ భట్టాచార్య, ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ అశోక్ కుమార్, బిందియా ఛాబ్రియా తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ ఎంత? ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కాక్‌టెయిల్ మూవీకి ఫ్రాంచైజీగా వస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరక్కించారు. యూరప్‌లోని అందమైన సిస్లీ లాంటి ప్రదేశాల్లో చాలా రిచ్‌గా చిత్రీకరించడంతో ఈ సినిమా ప్రొడక్షన్ వ్యయం 95 కోట్ల రూపాయలు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు 35 కోట్ల రూపాయలు, ప్రమోషనల్ ఖర్చులు 20 కోట్ల రూపాయల అయ్యాయి. దాంతో ఈ సినిమా టోటల్ బడ్జెట్‌ను 150 కోట్లుగా రౌండప్ చేశారు.
కాక్ టెయిల్ 2 సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా 50 శాతం రికవరీని సాధించింది. దాంతో ఈ చిత్రం థియేట్రికల్ వాల్యూను 75 కోట్లుగా అంచనా వేశారు. ఈ సినిమా మంచి క్రేజ్ ఉండటంతో దాదాపు 3500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాదాపు 75 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.
ఇండియాలో ఈ చిత్రం 15 కోట్ల రూపాయలు తొలి రోజున వసూలు చేసింది. మహారాష్ట్రలో 3.66 కోట్ల రూపాయల గ్రాస్, ఢిల్లీలో 2.65 కోట్లు, గుజరాత్‌లో 1.55 కోట్లు, కర్ణాటకలో 1.5 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 90 లక్షలు, రాజస్థాన్‌లో 75 లక్షలు, తెలంగాణలో 70 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం రెండో రోజు కూడా రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం 19 కోట్ల రూపాయలు గ్రాస్ ఇండియాలో వసూలు చేసింది. మహారాష్ట్రలో 4.7 కోట్లు, ఢిల్లీలో 3.4 కోట్లు, గుజరాత్‌లో 2.5 కోట్లు, కర్ణాటకలో 1.75 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 1 కోటి, రాజస్థాన్‌లో 90 లక్షల రూపాయలు, పశ్చిమ బెంగాల్‌లో 80 లక్షల రూపాయలు, తెలంగాణలో 80 లక్షల రూపాయలు వసూలు చేసింది.
షాహిద్ కపూర్, కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం మూడో రోజు కూడా భారీగా వసూలు చేసింది. ఆదివారం సెలవు దినం రోజున 20 కోట్ల రూపాయలు రాబట్టింది. మహారాష్ట్రలో 4.5 కోట్లు ఢిల్లీలో 3.2 కోట్లు, గుజరాత్‌లో 2.5 కోట్లు, కర్ణాటకలో 1.60 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 1.26 కోట్లు, రాజస్థాన్‌లో 1 కోట్ల రూపాయలు, పశ్చిమ బెంగాల్‌లో 1 కోటి రూపాయలు, మధ్యప్రదేశ్‌లో 80 లక్షలు, తెలంగాణలో 70 లక్షల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో మంచి ఆదరణ కనిపించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 1 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో దీని విలువ 9.8 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం ఇండియాలోని 54 కోట్ల రూపాయలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ చిత్రం 4వ రోజున 7 నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 70 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications