100 కోట్ల క్లబ్‌లో కాక్ టెయిల్.. రష్మిక, కృతి సనన్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ కలిసి నటించిన కాక్‌టెయిల్ 2 చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలివారాంతం ఈ సినిమా భారీగానే వసూళ్లను సాధించినప్పటికీ.. 4వ రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురైంది. కానీ ఈ సినిమా మళ్లీ పుంజుకొని 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రానికి హోమీ అదాజానియా దర్శకత్వం వహించగా దినేష్ జైన్, లవ్ రంజన్, ప్రతిమా ఆర్ విజన్, అంకుర్ గార్గ్ నిర్మించారు. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించగా, శారద కర్కి జలోటా, పూజా ప్రేమ్ పాతీజా సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: ప్రీతమ్, ఎడిటర్: అక్షర ప్రభాకర్, సినిమాటోగ్రఫి: సంతాన కృష్ణన్ రవిచంద్రన్, లిరిక్స్: అమితాబ్ భట్టాచార్య, ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ అశోక్ కుమార్, బిందియా ఛాబ్రియా తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఈ సినిమా గత 8 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కాక్‌టెయిల్ మూవీకి ఫ్రాంచైజీగా వస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరక్కించారు. యూరప్‌లోని అందమైన సిస్లీ లాంటి ప్రదేశాల్లో చాలా రిచ్‌గా చిత్రీకరించడంతో ఈ సినిమా ప్రొడక్షన్ వ్యయం 95 కోట్ల రూపాయలు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు 35 కోట్ల రూపాయలు, ప్రమోషనల్ ఖర్చులు 20 కోట్ల రూపాయల అయ్యాయి. దాంతో ఈ సినిమా టోటల్ బడ్జెట్‌ను 150 కోట్లుగా రౌండప్ చేశారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా 50 శాతం రికవరీని సాధించింది. దాంతో ఈ చిత్రం థియేట్రికల్ వాల్యూను 75 కోట్లుగా అంచనా వేశారు.
ఈ సినిమా ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 13.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 16.25 కోట్లు, మూడో రోజు 17.75 కోట్లు నమోదు అయ్యాయి. తొలి వారాంతంలోనే 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే తొలి వారాంతం తర్వాత కలెక్షన్లు 50 శాతం తగ్గాయి. ఫస్ట్ వీక్ ముగిసే సమయానికి 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ చిత్రం గురువారం 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 71 కోట్లకుపైగా నెట్, 85.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రాంతాల వారీగా కలెక్షన్లు చూస్తే.. ఢిల్లీలో అత్యధికంగా 14.5 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 5.5 కోట్లు, పంజాబ్‌లో 2.5 కోట్లు, మహారాష్ట్రలో 18 కోట్ల రూపాయలు, గుజరాత్‌లో 10 కోట్ల రూపాయలు, పశ్చిమ బెంగాల్‌లో 3.5 కోట్లు, కర్ణాటకలో 7 కోట్ల రూపాయలు, తెలంగాణలో 3 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1 కోటి రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో కూడా భారీగా వసూళ్లను సాదించింది. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, ఇతర దేశాల్లో 2.5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ధాంతో ఈ చిత్రం 107 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఇప్పటి వరకు 66 శాతం థియేట్రికల్ రికవరీని సాధించగా. ఇంకా 34 శాతం రికవరీ సాధించాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications