Cocktail 2 Business: కాక్‌టెయిల్ 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్..రష్మిక మూవీ బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?
బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన తాజా చిత్రం కాక్ టెయిల్ 2. టాప్ హీరో సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించే ఈ చిత్రానికి హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దినేష్ జైన్, లవ్ రంజన్, ప్రతిమా ఆర్ విజన్, అంకుర్ గార్గ్ నిర్మించారు. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించగా, శారద కర్కి జలోటా, పూజా ప్రేమ్ పాతీజా సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: ప్రీతమ్, ఎడిటర్: అక్షర ప్రభాకర్, సినిమాటోగ్రఫి: సంతాన కృష్ణన్ రవిచంద్రన్, లిరిక్స్: అమితాబ్ భట్టాచార్య, ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ అశోక్ కుమార్, బిందియా ఛాబ్రియా తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ స్టార్స్ సైఫ్ ఆలీ ఖాన్, దీపిక పదుకోన్, డియాన పెంటీ కలిసి 2012 సంవత్సరంలో నటించిన కాక్‌టెయిల్ సినిమాకు ఫ్రాంచైజీగా వస్తున్న ఈ సినిమాను భారీగా రిచ్ లొకేషన్లు, ఖర్చుకు వెనుకాకుండా ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 95 కోట్ల రూపాయలు కాగా, 35 కోట్ల రూపాయలు నటీనటుల రెమ్యునరేషన్లు, టెక్నిషియన్స్ పారితోషికాలు, 20 కోట్ల రూపాయల ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు.
అయితే ఈ సినిమా టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంత నాన్ థియట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ లాంటి ద్వారా ఈ సినిమా 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 50 శాతం రికవరీని బడ్జెట్ పరంగా రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక రష్మిక, కృతి సనన్ నటించిన ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్‌ను కూడా భారీగానే వాల్యూ కట్టారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వాల్యూను 70 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అంటే ఈ సినిమా కనీసం 70 కోట్ల షేర్, 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 150 కోట్ల గ్రాస్ వసూళ్లుగా పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్సాన్స్ కనిపిస్తున్నది. దాంతో ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక మందన్నకు ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందిస్తుందని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications