'రచ్చ' కలెక్షన్స్ డ్రాప్.. నివారణ చర్యలు
మొదట్లో రికార్డు బ్రేక్ తరహాలో వీకెండ్ ఓపినింగ్స్ తెచ్చుకున్న రామ్ చరణ్ రచ్చ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యిపోయాయని పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఓ న్యూస్ ప్రచురించింది. డ్రాస్టిక్ గా కలెక్షన్స్ డ్రాప్ అయిపోవటంతో నిర్మాతలు సినిమాని నిలబెట్టడానికి ఓ పాటను కలపుతున్నారని,త్వరలో దీనిపై ఓ అఫీషియల్ ప్రకటన వస్తుందని రాసుకొచ్చారు. అలాగే ఆ పాటతో పడిపోతున్న కలెక్షన్స్ ని నిలబెట్టే ప్రయత్నమిదని రాసుకొచ్చింది. ఇక ట్రేడ్ లో సైతం వీకెండ్ లో తప్ప మిగతా రోజుల్లో రచ్చకు కలెక్షన్స్ ఉండటం లేదని చెప్తున్నారు.
ఈ నేపధ్యంలో అభిమానులకు మరింత కిక్ ఇవ్వటానికి మెరుపుకోసం చిత్రీకరించిన పాటను జతపరచటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే కొద్ది రోజులు అయ్యాక ఈ పాటని కలపుతారని తెలుస్తోంది. కలెక్షన్స్ డ్రాప్ అవకుండా తీసుకునే జాగ్రత్తగా దీన్ని సినీ పండితులు అభివర్ణిస్తున్నారు. మెరపు చిత్రం రచ్చ చిత్రానికి ముందు ఇదే బ్యానర్ పై ప్రారంభమై ఆగిపోయింది. దాంతో ఆ సినిమా కోసం చిత్రీకరించిన భాగం అలా మిగిలిపోయింది. ఇప్పుడిలా వినియేగించుకుంటున్నారు.
ఇక బంగారం దర్శకుడు ధరణితో ఈ మెరుపు చిత్రం మొదట మొదలెట్టారు. సూపర్ మ్యాన్ తరహా కాన్సెప్ తో అనుకున్న చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక రషష్ చూసి బాగా రాకపోవటంతో ఆపు చేయటం జరిగింది. అప్పట్లో రామ్ చరణ్ సరసన ఆ సినిమాలో కాజల్ నటించింది. ఈ సినిమా షూటింగ్ ఆపుచేసి పరుచూరి బ్రదర్స్ తో చాలా కాలం సిట్టింగ్ లలో కూర్చున్నా కథ సంతృప్తి కరంగా రాకపోవటంతో పూర్తిగా అటకెక్కించి రచ్చని ముందుకు తోసారు. అయితే రచ్చ ప్రారంభోత్సవంలో మాత్రం మెరుపు ను రచ్చతర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ చెప్పుకువచ్చారు. కానీ ఇప్పుడా సూచనలు ఏమీ కనపడటం లేదు.
ఇక రాంచరణ్, తమన్నా జంటగా రూపొందిన 'రచ్చ' చిత్రం రికార్డు స్ధాయి షేర్ సాధించిందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి. ప్రసాద్ ప్రకటిస్తూ ప్రమోట్ చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎన్.వి. ప్రసాద్, పారస్ జైన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి నాలుగు రోజుల కలెక్షన్ల విషయంలో తెలుగులోని టాప్ సినిమాల్లో రచ్చ సినిమా స్థానం సంపాదించుకుందని అప్పట్లో అఫీషియల్ గా పత్రికల్లో ప్రకటన చేసారు.
అలాగే తమిళంలో ఈ నెల 6న 'రగళై' పేరుతో 280 థియేటర్లలో విడుదల చేస్తే దాని కలెక్షన్లకు తమిళ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైందని చెప్పారు. మూడు భాషల్లో కలిపి దక్షిణ భారతంలో 'రచ్చ' ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నామన్నారు. కలెక్షన్ల విషయంలో పాత రికార్డుల్ని 'రచ్చ' తిరగరాసింది. రాంచరణ్ అంకితభావం వల్లే అనుకున్న సమయానికి సినిమా విడుదలైంది అని నిర్మాత వాకాడ అప్పారావు ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కలెక్షన్స్ ఇలా డ్రాప్ అయిపోవటంతో అందరూ నివారణోపాయాలు ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











