Balagam Movie 1st Day Collections: కమెడియన్ వేణు ఫస్ట్ సినిమా.. మొదటి రోజు ఎంత వచ్చాయంటే?

సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే విషయం తెలిసిందే. ఆ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద బడ్జెట్ ఉండనవసరం లేదు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరోసారి బలగం సినిమాతో రుజువైంది చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

కమెడియన్ గా కెరీర్

కమెడియన్ గా కెరీర్

జై సినిమాతో కమెడియన్ గా కెరియర్ ప్రారంభించిన ఎల్దండి వేణు తర్వాత జబర్దస్త్ కార్యక్రమం మొదలైన తర్వాత అందులో కమెడియన్ గా మెరిసాడు. చాలా కాలం పాటు జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా తర్వాత టీం లీడర్ గా పనిచేస్తు... ఆ తర్వాత సినిమాల్లో కూడా అడపాదడదా కనిపిస్తూ ఉండేవాడు.

అయితే గత కొద్ది సంవత్సరాలుగా వేణు పూర్తిస్థాయిలో జబర్దస్త్ కు మాత్రమే కాదు సినిమాలకు కూడా దూరమైన పరిస్థితి నెలకొంది. అయితే ఆయన దర్శకుడిగా సినిమా అనౌన్స్ చేయగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

 స్టార్ క్యాస్ట్

స్టార్ క్యాస్ట్

ఒక కమెడియన్ సినిమా చేస్తే కామెడీ సినిమా అనుకుంటారు. కానీ ఆయన మాత్రం దిల్ రాజును ఒప్పించి బలగం అనే ఫుల్ లెన్త్ ఎమోషనల్ ఎంటర్టైనర్ తెరకెక్కించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, రోహిణి, రచ్చ రవి వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరిట దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి నిర్మించింది.

చిన్న బడ్జెట్ లో..

చిన్న బడ్జెట్ లో..

ముందు నుంచి కూడా ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎమోషనల్ కంటెంట్ కావడంతో దాదాపుగా అందరినీ ఆకట్టుకుంది. కేవలం మూడు కోట్ల రూపాయల బడ్జెట్ తోనే ఈ సినిమాని దిల్ రాజు కుమార్తె చాలా గ్రాండ్ గా తెరకెక్కించింది.

పాజిటివ్ టాక్

పాజిటివ్ టాక్

పూర్తిగా ఒకే ఊరిలో పది రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఈ సినిమాని చాలా రిచ్ లుక్ వచ్చేలా నిర్మించారు. చిన్న బడ్జెట్ లో ... చక్కటి చిత్రం నిర్మించారు. విజువల్స్ అన్ని రిచ్ లుక్ లో ఉన్నాయి. ఇక సినిమా మొదటి రోజు అయితే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.

మొదటి రోజు కలెక్షన్స్

మొదటి రోజు కలెక్షన్స్

బలగం సినిమా ముందుగానే టీజర్ ట్రైలర్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. దీంతో సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఇక సినిమాను దిల్ రాజు టీమ్ చాలా తెలివిగా ప్రమోట్ చేయడంతో నైజాంలో మంచి ఒపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా 70 లక్షల నెట్ వసూళ్లు చేయగా 50 లక్షల షేర్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

కలెక్షన్స్ పెరిగే అవకాశం

కలెక్షన్స్ పెరిగే అవకాశం

ఆంధ్ర ప్రాంతం వారికి కొంత కనెక్ట్ కాకపోయినా నైజాం మొత్తం ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి రోజు శుక్రవారం వసూళ్లలో పెద్దగా జోరు కనిపించకపోయినా సినిమా బడ్జెట్ తో పోల్చుకుంటే చాలా మేరకు మొదటి రోజే వచ్చేసినట్లుగా చెబుతున్నారు. శనివారం ఆదివారం కూడా కొంత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో నైజాం ప్రాంతంలో ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలు లేకపోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X