ఆగస్టు 2013: తెలుగు చిత్రాలు- రిలీజ్ డేట్స్

By Srikanya

హైదరాబాద్: ఆగస్టులో తెలుగులో వరసగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు,డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. దాదాపు తొమ్మిది చిత్రాలు దాకా ఆగస్టు నెలలో విడుదల అవటానికి క్యూ కట్టాయి. ఈ చిత్రాలను పెద్ద సినిమాల మధ్యన ఇరుక్కోకుండా దర్శక,నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా ఈ నెలలో పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంపైనే అందరి దృష్టీ ఉంది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మరో సారి కలిసి చేస్తున్న చిత్రం కావటం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావటం ఈ చిత్రానికి కలిసి వచ్చిన క్రేజీ అంశం. ముఖ్యంగా పవన్ అబిమానులే కాక అందరూ ఈ చిత్రంపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలాగే మరో పెద్ద చిత్రం రామ్ చరణ్ ఎవడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం కూడా ఆగస్టు లోనే విడుదల కానుంది. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన 'ఎవడు' చిత్రం విడుదల వాయిదా పడింది. దీనికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రాన్ని మొదట ఈనెల 31న విడుదల చేద్దామనుకొన్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొన్నారు.


సినిమాలు-విడుదల తేదీలు ...స్లైడ్ షోలో...

రొమాన్స్ -ఆగస్టు 2

రొమాన్స్ -ఆగస్టు 2

గుడ్ సినిమా గ్రూప్ మారుతీ మీడియా హౌస్ పతాకంపై డార్లింగ్ స్వామి దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు, ఎస్.కె. ఎన్. నిర్మించిన ‘రొమాన్స్' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రిన్స్, డింపుల్, మానస నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- తమ ద్వితీయ ప్రయత్నంగా ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా రూపొందించామని, అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో, ట్రైలర్లకు మంచి ఆదరణ లభిస్తోందని, పక్కా యూత్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రభాక్, నల్లవేణు, సాయి, భారవి, వెంకీ, విష్ణుప్రియ, సాయికృష్ణ, బిందు, అవినాష్, జాహ్నవి తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: కాసర్ల శ్యామ్, కరుణాకర్, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, కెమెరా: జె.ప్రభాకర్‌రెడ్డి, సంగీతం: సాయి కార్తీక్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డార్లింగ్ స్వామి

'దమ్ముంటే కాస్కో'- ఆగస్ట్ 3న

'దమ్ముంటే కాస్కో'- ఆగస్ట్ 3న

విజయ్, ప్రియాంకా చోప్రా జంటగా నటించిన చిత్రం 'దమ్ముంటే కాస్కో' ఆగస్ట్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో విజయం సాధించిన ఓ చిత్రానికి ఇది తెలుగు అనువాద రూపం. లక్ష్మీ వాసంతి ప్రొడక్షన్స్ పతాకంపై అడ్డాల వెంకట్రావు అందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ "తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు వాతావరణానికి తగ్గట్లు ఉంటుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరు, ప్రస్తుతం 'తుఫాన్'లో రామ్‌చరణ్ జోడీగా నటించిన ప్రియాంకా చోప్రా అందచందాలు, అభినయం ఈ సినిమాకి ఎస్సెట్. కథ ప్రకారం జనాన్ని మోసం చేస్తూ డబ్బు సంపాదించే విలన్‌ను 'లా' చదివిన హీరో ఎదిరిస్తాడు. దాని వల్ల ఎదురైన సమస్యల్ని అతనెలా అధిగమించాడు, ప్రజలకు ఎలా న్యాయం చేశాడనేది ఆసక్తికరం. హీరోగా పవర్‌ఫుల్ కేరక్టర్‌ను విజయ్ గొప్పగా చేశారు. డి. ఇమాన్ సంగీతం సమకూర్చిన ఐదు పాటలూ అలరిస్తాయి. కణల్ కణ్ణన్ కంపోజ్ చేసిన నాలుగు ఫైట్లు హైలైట్‌గా నిలుస్తాయి'' అని చెప్పారు. ఆశిశ్ విద్యార్థి, నాజర్, రేవతి, వివేక్, వాసు విక్రమ్ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: మల్లూరి వెంకట్, పాటలు: పొందూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మజీద్.

'అత్తారింటికి దారేది'-ఆగస్టు 7

'అత్తారింటికి దారేది'-ఆగస్టు 7

'అత్తారింటికి దారేది'లోనూ కల్యాణ్‌తో ఇద్దరు భామలు - సమంత, ప్రణీత ఆడి పాడారు. ఇటీవలే తెలుగులో 'మిర్చి'తో రీ-ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి అందాల తార నదియా ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మేనత్త పాత్రను పోషించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు మాటల మాంత్రికునిగా పేరుపొందిన దర్శకుడు త్రివిక్రమ్. 'జల్సా' వంటి మ్యూజికల్ హిట్ తర్వాత కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే దీనికి యమ క్రేజ్ ఏర్పడింది. కల్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిన 'వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ' అనే పాట ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కల్యాణ్ ఇమేజ్ శిఖరాగ్రానికి చేరుకుంది. 'కెమెరామన్ గంగతో రాంబాబు' ఆశించిన రీతిలో ఆడకపోయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

అన్న ---‘బోర్న్ టు లీడ్' (డబ్బింగ్)- ఆగస్టు 9

అన్న ---‘బోర్న్ టు లీడ్' (డబ్బింగ్)- ఆగస్టు 9

విజయ్, అమలాపాల్ జంటగా నటించిన ‘తలైవా' సినిమా తెలుగులోకి ‘అన్న' అనే పేరుతొ అనువాదం కానుంది. ‘బోర్న్ టు లీడ్' అనేది దీని ఉపశీర్షిక. ‘మదరాసిపట్టణం', ‘తాండవం' వంటి సినిమాలను తీసిన ఏ.ఎల్ విజయ్ ఈ సినిమాను తీసాడు. తమిళంలో భారీ విడుదల కాబోతున్న ఈ ‘అన్న' సినిమా పూర్తిస్థాయి యాక్షన్ కధాంశంతో తెరకెక్కుతుంది. 2500 స్క్రీన్లపై తమిళ వెర్షన్ ను 250 స్క్రీన్లపై తెలుగు వెర్షన్ ను విడుదల చెయ్యాలని చిత్ర బృందం ఆలోచిస్తుంది. లక్ష్మి నరసింహా విజువల్స్ పై కాశీవిశ్వనాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 3కె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా ఈ సినిమాను పంపిణి చేస్తున్నారు. జి.వి ప్రకాష్ సంగీత దర్శకుడు. ఆగష్టు 9న ఈ సినిమా విడుధలకావచ్చు

దండుపాళ్యం పోలీస్ (డబ్బింగ్) ఆగస్టు 15

దండుపాళ్యం పోలీస్ (డబ్బింగ్) ఆగస్టు 15

తమిళ్‌లో హిట్టయిన ఓ చిత్రాన్ని తుహిన ఫిల్మ్స్ పతాకంపై వీరబాబు సమర్పణలో గాజుల ఖాదర్‌భాషా నిర్మాణ సారథ్యంలో ‘దండుపాళ్యం పోలీస్' అనే చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర ఆడియో ఈ నెలాఖరున విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు వీరబాబు మాట్లాడుతూ-‘సన్మార్గంలో యువతను నడిపించాల్సిన ఓ పోలీస్ అధికారి కొందరు యువకులను ఉపయోగించుకుని, వారి జీవితాలతో ఎలా ఆడుకున్నాడు. అతను వాడుకున్న యువత దీనిద్వారా ఏం పోగొట్టుకున్నారు. వీరిని తప్పుదోవ పట్టించిన ఆ పోలీస్ చివరికి ఏం కోల్పోయాడు అనేది ఈ చిత్ర కథాంశం. అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమిది. ఈ చిత్రంలో ‘భీమిలి కబడ్డీజట్టు' ఫేమ్ కిశోర్ నటన ఆకట్టుకుంటుంది.

అంతకు ముందు ఆ తర్వాత

అంతకు ముందు ఆ తర్వాత

ఎమ్.ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా ..ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 16 వ తేదీన విడుదల అవుతోంది. తూనీగ తూనీగ చిత్రం ప్లాప్ కావటంతో సుమంత్ అశ్విన్ ఈ చిత్రంపై బాగా నమ్మకం పెట్టుకున్నారు. అష్టాచెమ్మ వంటి చిత్రం డైరక్ట్ చేసిన చిత్రం కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

'ఎవడు'

'ఎవడు'

రామ్‌చరణ్, శృతిహాసన్, అమీజాక్సన్ ప్రధాన పాత్రధారులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాజు నిర్మించిన ‘ఎవడు' చిత్రం ఆగస్ట్ 21న విడుదల చేయడానికి నిర్ణయించారు. మొదట ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయడానికి ప్రకటన చేశారు. ''చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22. దానికి ఒకరోజు ముందు.. ఈ సినిమాని విడుదల చేస్తాం'' అని విలేకరుల సమావేశంలో నిర్మాత దిల్‌రాజు చెప్పారు. శుక్రవారం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకొంది. సెన్సార్‌ బోర్డు 'ఏ' ధృవీకరణ పత్రం జారీ చేసింది.

అడ్డా- ఆగస్టు 29

అడ్డా- ఆగస్టు 29

సుశాంత్, శాన్వి జంటగా శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.కార్తీకరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అడ్డా'. చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ అనూప్ రూబెన్స్ అందించిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయని, బిజినెస్ పరంగా కూడా చాలా క్రేజ్ వచ్చిందని తెలిపారు. సుశాంత్‌కు ఓ టర్నింగ్ పాయింట్‌లా ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని తెలిపారు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, తా.రమేష్, నల్లవేణు, ధన్‌రాజ్, స్వప్నిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.అరుణ్‌కుమార్, ఎడిటింగ్: గౌంతరాజు, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.కార్తీక్‌రెడ్డి.

గోల్ మాల్- ఆగస్టు 29

గోల్ మాల్- ఆగస్టు 29

వెంకటేష్ , రామ్ హీరోలుగా బాలీవుడ్ ‘బోల్ బచ్చన్' సినిమాని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ని ‘గోల్ మాల్'గా ఖరారు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ ని ‘గరం మసాలా'గా ఇంతకు ముందు అనుకున్నారు. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాని డి. సురేష్ బాబు, స్రవంతి రవి కిషోర్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో అంజలి, అలాగే రామ్ తో షాజన్ పదమ్సీ జతకట్టతున్నారు. ఈ సినిమా ఆగస్టు 29 న విడుదలయ్యే అవకాశం వుంది.

పోటు గాడు

పోటు గాడు

మంచు మనోజ్ కథానాయకుడుగా నటించిన ‘పోటుగాడు' చిత్రం ఆగస్టులో విడుదలకు సిద్ధవౌతోంది. పవన్ వడేయార్ దర్శకత్వంలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీ్ధర్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- డబ్బింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని, నలుగురు అమ్మాయిలతో ప్రేమలో పడిన యువకుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడనేది ఈ చిత్రం లో ప్రధానాంశమని, అందుకే ‘పోటుగాడు' అనే పేరును నిర్ణయించామని తెలిపారు. సిమ్రాన్ కౌర్ ముండి, సాక్షీ చౌదరి, అనుప్రియ, రాచల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, దర్శకత్వం:పవన్ వడేయార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X