Committee Kurrollu 5 days Collections: కమిటీ కుర్రోళ్లు బాక్సాఫీస్ జోరు.. నిహారికకు ఎన్ని కోట్ల లాభమంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం కమిటీ కుర్రాళ్లు. యధూ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తున్నది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్‌తో స్నేహం, తెలుగు నేటివిటీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, రాంచరణ్ తదితరులు ప్రశంసలు గుప్పించారు. సినిమా రంగంపై నిహారిక అభిరుచిని, దర్శకుడి ప్రతిభను అభినందించారు.

ఇక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న కమిటీ కుర్రోళ్లు సినిమాను ఖర్చు విషయంలో రాజీ పడకుండా క్వాలిటీతో రూపొందించారు. ఈ సినిమాను 11 మంది కొత్త కుర్రాళ్లతో తెరకెక్కించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 8 కోట్ల రూపాయాలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కమిటీ కుర్రోళ్లు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షలు నికరంగా ప్రపంచవ్యాప్తంగా 1.63 కోట్ల గ్రాస్, రెండో రోజు 1.2 కోట్ల నికరంగా.. 1.5 కోట్ల గ్రాస్ వసూళ్లు, మూడో రోజు 1.6 కోట్లు నికరంగా 2.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇక వారాంతం తర్వాత కూడా స్టడీగా ఈ సినిమా వసూళ్లను రాబడుతున్నది. సాధారణంగా కలెక్షన్లు క్షీణించే సోమవారం కూడా భారీగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా 4వ రోజు 80 లక్షలు నికరంగా 1.5 కోట్ల గ్రాస్, 5వ రోజు 80 లక్షలు నికరంగా, 1.5 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8.49 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
కమిటీ కుర్రోళ్లు 8 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టిన ఈ చిత్రం కేవలం 4, 5 రోజుల్లో భారీగా వసూళ్లను రాబట్టి లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే లాభాలను సాధిస్తున్న ఈ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది.


Click it and Unblock the Notifications











