3వ వారంలో కూడా దుమ్మురేపుతున్న కమిటీ కుర్రోళ్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నది. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదలైన ఈ సినిమా 3వ వారంలో కూడా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా 15 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గోదావరి జిల్లా నేపథ్యంగా స్థానిక రాజకీయాలు, కులాల బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో దాదాపు అంతా కొత్తవారే. కంటెంట్‌పై నమక్మంతో ఈ సినిమా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. అన్ని ఖర్చులు కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 6 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక దాదాపు 8 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను కొనసాగించింది.

ఇక ఈ చిత్రం ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో మంచి వసూళ్లను నమోదు చేసింది. గత 14 రోజుల్లో నైజాంలో 3.45 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 80 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 3.10 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 7.5 కోట్లు షేర్, 13 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాను ప్రవాసాంధ్రులు బాగా ఆదరించారు. ఈ సినిమా కర్నాటక, ఇతర రాష్ట్రాలు, అమెరికాలో కలిపి మొత్తంగా 65 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 14.2 కోట్ల రూాయలు వసూలు చేసింది.

ఇక 15వ రోజు విషయానికి వస్తే.. ఈ సినిమా సుమారుగా 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం మూడో వారంలో దండిగా కలెక్షన్లను రాబడుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా 15.6 కోట్ల రూపాయల గ్రాస్, 8.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్, క్రిష్, దేవిశ్రీప్రసాద్ ఇలా చాలా మంది కమిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు.


Click it and Unblock the Notifications











