ఆ చిత్రం రీమేక్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ
ఇక ఈ చిత్రం నిర్మాత ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సిఇఓ విజయ్ సింగ్ మాట్లాడుతూ...చాలా మంది ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం అడుగుతున్నారని, అయితే తాము ఇంకా ఎవరికీ ఖరారు చేసి రైట్స్ ఇవ్వలేదని అన్నారు. తమిళ,మళయాళ నిర్మతల నుంచి కూడా ఈ చిత్రం రీమేక్ రైట్స్ విషయమై పోటీ నెలకొనింది. ఇక ఈ చిత్రంలో కీ రోల్ లో చేసిన బొమన్ ఇరానీ ప్రస్తుతం త్రివిక్రమ్,పవన్ చిత్రం చేస్తున్నారు.
త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ చిత్రాల ద్వారా స్టార్ గా ఎదిగిన బొమన్ ఇరాని వెర్సటైల్ ఆర్టిస్టు. ఆయన్ను తెలుగులోకి ఓ మంచి పాత్ర ద్వారా పరిచయం చేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో క్షణక్షణం ద్వారా పరేష్ రావెల్ తెలుగులోకి వచ్చినట్లే బొమన్ ఇరాని కూడా ఇలా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా పాపులర్ కానున్నారు.
ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రానికి నిర్మాత. జల్సా తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి. ఈ చిత్రం కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట.


Click it and Unblock the Notifications












