Coolie 1st Week in Andhra, Nizam: కూలీ తొలివారం కలెక్షన్లు ఎన్ని కోట్లు? రజనీ మూవీ లాభాల్లోకి రావాలంటే?

దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా గత బడ్జెట్ ఎంత? తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత? గత 7 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఎంత రాబట్టాలి? అనే వివరాల్లోకి వెళితే..

ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు.

Coolie 1st Week Box Office

అయితే కూలీ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు విపరీతమైన బజ్ క్రియేట్ కావడం, మూవీపై భారీ అంచనాలు పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం భారీగానే పోటీ ఏర్పడింది. నాగవంశీ ప్రయత్ని వెనకడుగు వేసిన తర్వాత ఈ మూవీ ఆంధ్రా, నైజాం హక్కులను ఏషియన్, సురేష్, దిల్ రాజు దక్కించుకొన్నారు. జీఎస్టీతో కలిపి ఈ సినిమాను 54 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగింది అని తెలిసింది. దాదాపు 55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

కూలీ సినిమా రిలీజ్‌కు ముందు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. అయితే విడుదల తర్వాత ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు క్రమేపీ క్షీణించుకొంటూ వచ్చాయి. ఈ సినిమా గత వారం రోజుల్లో నైజాంలో 16 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 5.8 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.75 కోట్లు, కృష్ణా జిల్లాలో 2.5 కోట్లు, నెల్లూరులో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 40 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు రాబట్టింది.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం.. థియేట్రికల్ రైట్స్ బిజినెస్ చూస్తే ఇప్పటి వరకు సుమారుగా 80 శాతం రికవరీని సాధించింది. ఇంకా 20 శాతం మేర వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. రెండో వారంలో నిలకడగా వసూళ్లను రాబడితే.. రెండో వారాంతంలో స్ట్రాంగ్‌‌గా కలెక్షన్లు రాబడితే.. నష్టాలను పూడ్చుకొని లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ఏ మేరకు లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X