Coolie USA Collections: కబాలీ, లియో రికార్డులు బ్రేక్.. రిలీజ్‌కు ముందే కూలీ మూవీకి ఎన్ని కోట్లంటే?

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్‌‌లు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దాదాపు రూ.370 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూలీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

పుష్ప 2 రికార్డ్ బ్రేక్
భారీ స్టార్ క్యాస్టింగ్‌కు తోడు రజనీ ఇమేజ్, లోకేష్ కనగరాజ్ ట్రాక్ రికార్డ్‌తో కూలీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే తమిళనాడుతో పాటు ఓవర్సీస్‌లో రజనీ మేనియా మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో ఒక్కొక్క సినిమా రికార్డును ఓవర్సీస్‌లో బ్రేక్ చేస్తూ వెళ్తున్నాడు తలైవా. పుష్ప 2 మూవీకి బుకింగ్ మొదలైన 48 గంటల తర్వాత 802 టికెట్లు సేల్ అయితే.. కూలీ మాత్రం ఆ ఫీట్‌ను కేవలం గంటల వ్యవధిలోనే బ్రేక్ చేసేసింది. రజనీ చిత్రానికి 24 గంటల్లోనే 9127 టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

Coolie Advance Booking Rajinikanth s Movie becomes first Tamil film to break 2 million US premiere pre-sales

ఓవర్సీస్‌లో కూలీ దూకుడు
కూలీ సినిమా నార్త్ అమెరికా రైట్స్‌ను ప్రత్యాంగీరా సినిమాస్ దక్కించుకుంది. దీంతో ఈ సంస్థ అమెరికా, కెనడాలలో సినిమాను విడుదల చేస్తోంది. నార్త్ అమెరికాతో దాదాపు 488 లోకేషన్‌లలో 1450 షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అమెరికాలోనే కాకుండా తమిళులు పెద్ద సంఖ్యలో ఉన్న సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, యూకే, ఐర్లాండ్ తదితర దేశాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

నార్త్ అమెరికాలో రజనీ సరికొత్త చరిత్ర
తాజాగా రజనీకాంత్ కూలీ చిత్రం మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. నార్త్ అమెరికా ప్రీమియర్స్‌లో ప్రీ సేల్స్‌లో 2 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో 17 కోట్ల రూపాయలు) పైగా వసూలు చేసి ఈ ఘనత సాధించిన తొలి తమిళ చిత్రంగా నిలిచింది. ఇంతకుముందు యూఎస్ ప్రీమియర్స్‌ ప్రీ సేల్స్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రజనీకాంత్ నటించిన కబాలీ (1.92 మిలియన్స్), ఆ తర్వాత విజయ్ దళపతి లియో (1.86 మిలియన్ డాలర్లు), ది గోట్ (1.09 మిలియన్ డాలర్లు), పొన్నియన్ సెల్వన్ 1 (1.05 మిలియన్ డాలర్లు), జైలర్ (9,48,698 డాలర్లు) సాధించాయి. దాంతో 9 ఏళ్ల నాటి కబాలి రికార్డును తానే బద్ధలు కొట్టాడు రజనీకాంత్. యూఎస్‌లో ప్రీమియర్స్‌కు మరో రెండు రోజులు టైం ఉండటంతో కూలీ మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టే అవకాశం కనిపిస్తోంది.

రిలీజ్‌కు ముందే కూలీకి ఎన్ని కోట్లంటే?
ఇక ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ విషయంలోనూ కూలీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫస్ట్ డే ప్రీ సేల్స్‌ ద్వారా కేరళలలో 6 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇది ఓ రజనీకాంత్ సినిమా కేరళలో సాధించిన అత్యధిక మొత్తంగా విశ్లేషకులు చెబుతున్నారు. రిలీజ్‌కు మరో 2 రోజులు వ్యవధి ఉండటంతో అప్పటికి రజనీకాంత్ మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా రిలీజ్‌కు ముందే ప్రీ సేల్స్ ద్వారానే కూలీ చిత్రం వరల్డ్ వైడ్‌గా 65 కోట్ల రూపాయలకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే కూలీ ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X