Coolie AP, TG Collection: రజనీ మాస్ రాంపేజ్.. ఆంధ్రా, నైజాంలో కూలీకి ఎన్ని కోట్లంటే?
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు రికార్డ్ ఓపెనింగ్స్‌తో దుమ్మురేపిన రజనీ తన హవా చూపిస్తూనే ఉన్నారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్‌లలో ఎదురు లేకుండా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండ్రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది చూస్తే..
కూలీ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్‌గా నటించారు. అలాగే ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్‌లు కీలకపాత్రలు పోషించారు.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించారు. పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.370 కోట్ల భారీ బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

2 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా కూలీ కలెక్షన్స్ ఎంత?
కూలీకి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 155 కోట్ల ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు 65 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో రెండ్రోజుల్లో 80 కోట్లు, హిందీలో 15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్లు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల చొప్పున రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 118 కోట్ల రూపాయల షేర్.. 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది కూలీ.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ బిజినెస్ ఎంత?
ఆంధ్రా, నైజాంలలో కూలీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే.. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు)తో కూలీ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలో కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తమిళనాడుతో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. దీంతో కూలీకి ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ దక్కాయి. రెండో రోజు సెలవు దినం కావడంతో వసూళ్లు అదిరిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కూలీకి 20 కోట్ల రూపాయలు, రెండో రోజు 15 కోట్ల రూపాయలు చొప్పున కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 13 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 3 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 4 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3 కోట్ల రూపాయలు, నెల్లూరులో కోటి రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. దీంతో రజనీకాంత్ మూవీకి రెండు రోజుల్లో 17 కోట్ల రూపాయల షేర్.. 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో కూలీ హవా ఇలాగే కొనసాగితే డిస్ట్రిబ్యూటర్లు ఒడ్డునపడతారని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











