Coolie USA, Australia Advance Booking: యూఎస్, ఆస్ట్రేలియాలో కూలీ రికార్డు.. రజనీ మూవీకి కలెక్షన్ల పంట!

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. ఈ మూవీ రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ వేగ వంతం చేశారు. పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్‌ను ఓపెన్ చేశారు. ఈ ప్రీ సేల్స్ విషయంలో అమెరికా, ఆస్ట్రేలియాలో రికార్డు దిశగా ఆడుగులేస్తున్నది. ఈ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Coolie Box Office Collections

కూలీ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టారు. ఈ ప్రీ సేల్స్‌ ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. అమెరికా, కెనడాలో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇంకా 10 రోజుల వ్యవధి ఉండగానే రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది అని ఈ సినిమాను యూఎస్‌లో రిలీజ్ చేస్తున్న ప్రత్యాంగీరా సినిమాస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇక ఈ సినిమాకు ఆస్ట్రేలియాలో కూడా భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా ప్రీ బుకింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే 1 లక్ష అస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇంకా 10 రోజులు ఉన్నందున రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గల్ఫ్, సింగపూర్, మలేషియా, జపాన్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X