Coolie Closing Collection: కూలీ క్లోజింగ్ కలెక్షన్స్.. భారీ నష్టాలు మిగిల్చిన రజనీకాంత్, ఎన్ని కోట్లంటే?
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్, అక్కినేని నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర వంటి దిగ్గజాలతో పాటు సత్యరాజ్, శృతిహాసన్, రచితా రామ్, సౌబిన్ షహర్‌లు కీలకపాత్రలు పోషించారు. పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది.
కోలీవుడ్‌లో ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ కావడం, అమీర్‌ఖాన్ కీలకపాత్ర పోషించడం, టీజర్, ట్రైలర్లు కూలీపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌కు కూలీ చిత్రం హిట్‌ను అందించిందా? ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..

కూలీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చులతో కలిపి కూలీకి దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలలో కూలీ హక్కులను ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు)కు దక్కించుకుంది. దీంతో ఆంధ్రా, నైజాంలలో రజనీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
ఇండియాలో కూలీ కలెక్షన్స్:
18 రోజుల వరకు ఇండియాలో కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజున 70 కోట్ల రూపాయలు, 2వ రోజున 57 కోట్ల రూపాయలు, 3వ రోజున 41 కోట్ల రూపాయలు, 4వ రోజున 37 కోట్ల రూపాయలు, 5వ రోజున 13 కోట్ల రూపాయలు, 6వ రోజున 10.35 కోట్ల రూపాయలు, 7వ రోజున 8 కోట్ల రూపాయలు, 8వ రోజున 6.50 కోట్ల రూపాయలు, 9వ రోజున 7 కోట్ల రూపాయలు, 10వ రోజున 11 కోట్ల రూపాయలు, 11వ రోజున 12 కోట్ల రూపాయలు, 12వ రోజున 4 కోట్ల రూపాయలు, 13వ రోజున 4 కోట్ల రూపాయలు, 14వ రోజున 5.50 కోట్ల రూపాయలు, 15వ రోజున 3 కోట్ల రూపాయలు, 16వ రోజున 2 కోట్ల రూపాయలు, 17వ రోజున 3 కోట్ల రూపాయలు, 18వ రోజున 3.75 కోట్ల రూపాయలు వచ్చాయి. దాంతో కూలీకి ఇండియా వైడ్‌గా 280 కోట్ల రూపాయల నికర వసూళ్లు, 328 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఓవర్సీస్‌లో కూలీ సినిమాకు 188 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా 18 రోజుల వరకు రజనీకాంత్ మూవీకి 270 కోట్ల రూపాయల షేర్..536 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ వసూళ్లు
తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి తొలి రోజున 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు, మూడో రోజున 12 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.20 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2 కోట్ల రూపాయలు, 8వ రోజున కోటి 60 లక్షల రూపాయలు, 9వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 10వ రోజున 2.20 కోట్ల రూపాయలు, 11వ రోజున 2 కోట్ల రూపాయలు, 12వ రోజున కోటి రూపాయలు, 13వ రోజున కోటి రూపాయలు, 14వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 15వ రోజున 60 లక్షల రూపాయలు, 16వ రోజున 50 లక్షల రూపాయలు, 17వ రోజున 55 లక్షల రూపాయలు, 18వ రోజున 65 లక్షల రూపాయలు వసూళ్లు వచ్చాయి. దాంతో 18 రోజుల వరకు కూలీ మూవీ ఆంధ్రా, నైజాంలలో 78 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 20 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.50 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.75 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. మొత్తంగా 18 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ 56 కోట్ల రూపాయల షేర్.. 78 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో 185 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 21 కోట్ల రూపాయలు, కేరళలో 18 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కూలీకి లాభమెంత? నష్టమెంత?
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనంత స్థాయిలో కూలీపై హైప్ నెలకొంది. దీనికి తోడు ఆగస్ట్ 14న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌లు నటించిన వార్ 2 కూడా రిలీజ్ కావడంతో కూలీకి గట్టి పోటీ ఎదురవ్వడంతో పాటు హైప్ తారాస్థాయికి చేరుకుంది. తొలివారం గట్టిగానే రాబట్టిన కూలీ చిత్రం.. ఆ తర్వాతి నుంచి క్రమంగా కలెక్షన్స్ కోల్పోతూ వచ్చింది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కూడా కూలీ వసూళ్లపై ప్రభావం చూపింది. దాంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది.
ఆంధ్రా, నైజాంలలో కూలీ 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉండగా రజనీకాంత్ మూవీ కేవలం ఇప్పటి వరకు 78 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి దాదాపు 32 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. వరల్డ్ వైడ్‌గా 312 కోట్ల రూపాయల షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. కానీ కూలీ చిత్రం ఇప్పటి వరకు 536 కోట్ల రూపాయల గ్రాస్, 270 కోట్ల రూపాయల షేర్ మాత్రమే రాబట్టింది. దాంతో దాదాపు 50 కోట్ల రూపాయల షేర్, 90 కోట్ల రూపాయల గ్రాస్ నష్టంతో డిజాస్టర్‌గా నిలిచింది కూలీ. కాకపోతే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత కళానిధి మారన్ ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అపజయం అనేది లేకుండా వరుస బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్‌కు మాత్రం కూలీతో డ్యామేజ్ జరిగినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











