Coolie USA Collections: అమెరికాలో చరిత్ర సృష్టించిన కూలీ.. రజనీకాంత్ ఖాతాలో రేర్ రికార్డు
దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో నటించిన స్టార్స్ నికర ఆస్తుల విలువకు సంబంధించిన అంచనా వివరాల్లోకి వెళితే..
ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు.

అయితే ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టేందుకు సిద్దంగా ఉన్నారని తాజా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. గత 20 రోజుల క్రితమే ఈ సినిమా ప్రీ సేల్స్‌ను ప్రారంభించగా.. అనూహ్యమైన స్పందన లభించింది. తమిళం, తెలుగు భాషలకు భారీ ఆదరణ కనిపించింది. దాంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు అయ్యాయి.
నార్త్ అమెరికాలో రజనీకాంత్ సినిమాను ప్రముఖ డిస్టిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమాను అత్యధికంగా ప్రీమియర్లు ప్రదర్శిస్తున్నాం. అలాగే నార్త్ అమెరికాలో అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు చేసిన తొలి తమిళ సినిమాగా చరిత్ర సృష్టించింది అని ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించింది. గతంలో లియో పేరిటి ఉన్న రికార్డును అధిమించి రిలీజ్‌కు ముందే 2 మిలియన్ల వసూళ్లను రాబట్టింది అని తెలిపారు.
ఇదిలా ఉండగా, అమెరికాలో ప్రముఖ చైన్ థియేటర్ మేనేజ్‌మెంట్ సినీ మార్క్‌లో కూలీ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చైన్ థియేటర్‌లో సొంతంగా 1 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 8.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని తెలిపారు. సినీ మార్క్ థియేటర్లలో డిస్కో చేస్తుంది అంటూ వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు రోజుల వ్యవధి ఉండగానే రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్నది.


Click it and Unblock the Notifications











