Coolie Vs War 2 Collections: కూలీ కలెక్షన్ల జోరు.. వార్ 2 బేజారు.. రజనీతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ టఫ్ ఫైట్

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూలీ, వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన ఫైట్‌కు తెరలేపాయి. ఆగస్టు 15 పంద్రాగస్టు కానుకగా రిలీజవుతున్న ఈ రెండు స్టార్ వాల్యూ ఉన్న సినిమాలు కలెక్షన్లపరంగా ఆసక్తిని రేపుతున్నాయి. అయితే ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఇంకా వారం రోజులకుపైగా సమయం ఉండగా ఓవర్సీస్‌లో ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచేలా కనిపిస్తున్నాయి. నార్త్ అమెరికాతోపాటు యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో వార్ 2, కూలీ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

నార్త్ అమెరికాలో కూలీ, వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా? నేనా అనే విధంగా పోటీ పడేందుకు సిద్దమయ్యాయి. అమెరికా, కెనడాలో కూలీ చిత్రం ప్రీమియర్ షోకు సంబంధించి 1160 షోలను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా.. వార్ 2 సినిమాను 1600 షోలు ప్రదర్శించేందుకు సన్నాహాలు చేశారు. అయితే తక్కువ షోలు ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్, హృతిక్ మూవీపై రజనీకాంత్ సినిమా డామినేషన్ ప్రదర్శిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Coolie Cinema Dominates War 2

కూలీ సినిమాకు సంబంధించి ఇంకా వారం రోజుల వ్యవధి ఉండగానే.. ఈ చిత్రం 45 వేలకుపైగా టికెట్లు నార్త్ అమెరికాలో అమ్మకాలు జరిగాయి. అయితే వార్ 2 సినిమా మాత్రం కేవలం 7 వేల టికెట్లు మాత్రమే అమ్మినట్టు సోషల్ మీడియాలో పలువురు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. ఈ చిత్రం ఇప్పటికే నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి.. 2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటికే తమిళ వెర్షన్, తెలుగు వెర్షన్ టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి.

ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 7 వేల టికెట్ల ద్వారా 250K డాలర్లు వసూలు చేసింది. అయితే తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బాగానే ఉన్నప్పటికీ.. హిందీ వెర్షన్ ప్రీ సేల్స్ అంతగా లేకపోవడం షాకింగ్‌గా మారింది. ఈ సినిమా కేవలం 5 వేల డాలర్లే వసూలు చేయడం గమనార్హం. అయితే రానున్న రోజుల్లో హిందీ వెర్షన్ టికెట్ల అమ్మకాలతోపాటు తెలుగు కూడా భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

నార్త్ అమెరికా కాకుండా యూకేలో కూలీ సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది. అయితే యూకేలో ప్రీమియర్లతోపాటు తొలి రోజు కలెక్షన్ల రికార్డు విజయ్ నటించిన లియో సినిమా పేరిట ఉంది. ఈ చిత్రం 576000 పౌండ్లు వసూలు చేసింది. అయితే కూలీ చిత్రం ఈ రికార్డును బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మలేషియా, గల్ఫ్, సింగపూర్‌ ఇతర దేశాల్ల ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నది.

ఆస్ట్రేలియాలో ఈ సినిమా 12 వేల టికెట్లు, మలేషియాలో 25 వేల టికెట్లు, యూకేలో 22 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక గల్ఫ్, యూఏఈలో టికెట్ల అమ్మకాల జోరు కొనసాగుతున్నది. ఈ సినిమా రిలీజ్ డే నాటికి సుమారుగా 6 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: coolie war 2 box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X