Coolie Day 1 Box Office: ఓపెనింగ్స్‌లో రజనీ సరికొత్త చరిత్ర.. కూలీకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14వ తేదిన కూలీ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..
కూలీ బడ్జెట్ ఎంత?
అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. చెన్నై పరిసర ప్రాంతాలతో పాటు ఫేమస్ లోకేషన్స్‌లో కూలీ సినిమా చిత్రీకరణ జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.350 కోట్ల భారీ బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
రజనీకాంత్‌కు ఆంధ్రా, నైజాంలలో ఉన్న ఫాలోయింగ్‌కు తోడు కూలీ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌కు తీవ్ర పోటీ నెలకొంది. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు) వెచ్చించి కూలీ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. ఆంధ్రా, నైజాంలలో కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఇక తమిళనాడు రైట్స్ 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 20 కోట్లు, నార్త్ ఇండియా రైట్స్ 50 కోట్ల రూపాయలు, అలాగే ఓవర్సీస్ రైట్స్ 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీంతో కూలీ వరల్డ్ వైడ్‌గా సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. కూలీ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 12000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్
అడ్వాన్స్ బుకింగ్‌లో కూలీ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఇండియాతోపాటు ఓవర్సీస్, నార్త్ అమెరికాలో టికెట్ సేల్స్‌లో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ చిత్రం తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సుమారుగా 85 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక కూలీ సినిమా తొలి రోజున తమిళ వెర్షన్‌లో సాయంత్రం 5 గంటల వరకు 84 శాతం, హిందీలో 29 శాతం, తెలుగులో 92 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. రజనీ సొంత రాష్ట్రం కంటే తెలుగు రాష్ట్రాల్లోనే కూలీకి మంచి ఆదరణ దొరుకుతుండటం విశేషం.
రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్‌ల చిత్రం తొలిరోజు తమిళంలో 40 కోట్ల రూపాయలు, తెలుగులో 30 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 30 కోట్లు, ఓవర్సీస్‌లో 40 కోట్ల రూపాయల చొప్పున ఫస్ట్ డే కూలీ వరల్డ్ వైడ్‌గా 140 కోట్ల రూపాయల నుంచి 160 కోట్ల రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు ఊహిస్తున్నారు. అదే జరిగితే రజనీకాంత్ ఖాతాలో రేర్ రికార్డ్ పడినట్లే. మరి తలైవా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











