Coolie Day 1 Collections: కూలీ కలెక్షన్ల సంచలనం.. రజనీకాంత్ మూవీకి తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లంటే?

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

Coolie Day 1 Expected Box Office

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను ఏషియన్ సునీల్ సుమారుగా 54 కోట్ల (జీఎస్టీతో కలిపి) రూపాయలు, కేరళ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 20 కోట్లు, ఉత్తర భారతం రైట్స్ 50 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 100 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా మొత్తం బిజినెస్ సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కూలీ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 12000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. నార్త్ అమెరికాలో ఈ సినిమా సుమారుగా 100000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ సుమారుగా 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా ప్రీమియర్లు ముగిసి.. తొలి రోజు వరకు 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 90 కోట్ల రూపాయలు, తమిళనాడులో 35 కోట్ల రూపాయలు, కన్నడ, తెలుగు, కేరళ, హిందీలో కలిపి ఈ సినిమా 55 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 60 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజున ప్రీమియర్లతో కలిపి 150 నుంచి 175 కోట్ల మధ్య కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X