Coolie Day 12 Box Office: 500 కోట్ల క్లబ్‌లో కూలీ.. రజనీ మూవీ ఇంకా నష్టాల్లోనే.. ఇంకా ఎంత రాబట్టాలంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కూలీ. దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇటీవల కాలంలో భారీ వసూళ్లు సాధించిన చిత్రాల కలెక్షన్లను అధిగమించింది. తమిళ, తెలుగు భాషలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 120 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఆంధ్రా, నైజాంలో 54 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 30 కోట్ల రూపాయలు, కేరళ, ఇతర రాష్ట్రాల్లోని హక్కులు 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 320 కోట్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక గత 12 రోజుల్లో కూలీ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 132 కోట్ల రూపాయలు, ఆంధ్రా, నైజాంలో 65 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 40 కోట్ల రూపాయలు, కేరళలో 25 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. అలాగే ఓవర్సీస్‌లో కూడా భారీగా కలెక్షన్లను రాబట్టింది. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో ఈ సినిమా 20 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 180 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 482 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.
గత 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 17.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6.20 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.5 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 3 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 కోట్లు, గుంటూరులో 3 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 2.8 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.6 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 42 కోట్ల రూపాయల షేర్, 66 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
కూలీ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా 330 కోట్ల రూపాయల షేర్.. 660 కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్‌తో వరల్డ్ వైడ్‌గా, అలాగే 55 కోట్ల షేర్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల రూపాయల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











