Coolie Day 15 Box Office: కూలీ కలెక్షన్స్‌పై ఊహించని దెబ్బ.. రజనీ మూవీకి నష్టాలు తప్పాలంటే?

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూలీ. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాను సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, రచితా రామ్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కూలీలో కీలకపాత్రలు పోషించారు. పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం చేయగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 15 రోజుల్లో కూలీ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది? కూలీ లాభాల్లోకి రావాలంటే ఇంకా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది? ఈ వివరాల్లోకి వెళితే..

కూలీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చులతో కలిపి కూలీకి దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలలో కూలీ హక్కులను ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు)కు దక్కించుకుంది. దీంతో ఆంధ్రా, నైజాంలలో రజనీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

Coolie Day 15 Box Office Collections Worldwide rajinikanth film entered the list of the highest-grossing Tamil films

వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఇండియాలో కూలీ 14 రోజుల కలెక్షన్స్:
14 రోజుల వరకు ఇండియాలో కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజున 70 కోట్ల రూపాయలు, 2వ రోజున 57 కోట్ల రూపాయలు, 3వ రోజున 41 కోట్ల రూపాయలు, 4వ రోజున 37 కోట్ల రూపాయలు, 5వ రోజున 13 కోట్ల రూపాయలు, 6వ రోజున 10.35 కోట్ల రూపాయలు, 7వ రోజున 8 కోట్ల రూపాయలు, 8వ రోజున 6.50 కోట్ల రూపాయలు, 9వ రోజున 7 కోట్ల రూపాయలు, 10వ రోజున 11 కోట్ల రూపాయలు, 11వ రోజున 12 కోట్ల రూపాయలు, 12వ రోజున 4 కోట్ల రూపాయలు, 13వ రోజున 4 కోట్ల రూపాయలు, 14వ రోజున 5.50 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియా వైడ్‌గా కూలీ సినిమా 14 రోజుల వరకు 270 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాగా.. 320 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో కూలీ సినిమాకు 185 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా 14 రోజుల వరకు రజనీకాంత్ మూవీకి 255 కోట్ల రూపాయల షేర్..505 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో కూలీ 14 రోజుల వసూళ్లు
తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి తొలి రోజున 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు, మూడో రోజున 12 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.20 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2 కోట్ల రూపాయలు, 8వ రోజున కోటి 60 లక్షల రూపాయలు, 9వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 10వ రోజున 2.20 కోట్ల రూపాయలు, 11వ రోజున 2 కోట్ల రూపాయలు, 12వ రోజున కోటి రూపాయలు, 13వ రోజున కోటి రూపాయలు, 14వ రోజున 1.50 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయి. దాంతో 14 రోజుల వరకు కూలీ మూవీ ఆంధ్రా, నైజాంలలో 74 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 18 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6.75 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.25 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.20 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. మొత్తంగా 14 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ 53 కోట్ల రూపాయల షేర్.. 74 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో 173 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 19 కోట్ల రూపాయలు, కేరళలో 17 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

కూలీ 15వ రోజు కలెక్షన్స్
వినాయక చవితి పండగనాడు కలెక్షన్స్ ఊపందుకోగా.. 15వ రోజు మాత్రం కూలీకి అంతగా బుకింగ్స్ కావడం లేదు. తమిళనాడు తర్వాత స్ట్రాంగ్ హోల్డ్ సాధిస్తోన్న తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు సినిమాపై ప్రభావం చూపుతున్నాయి. తమిళనాడులోనూ బుకింగ్స్ పడిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 15వ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూలీకి తమిళంలో 12 శాతం, హిందీలో 6 శాతం, తెలుగులో 15 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది.

15వ రోజున కూలీకి తమిళంలో కోటి 50 లక్షల రూపాయలు, తెలుగులో 50 లక్షల రూపాయలు, కర్ణాటక, కేరళ + హిందీలో 50 రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయల వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దాంతో 15 రోజుల వరకు కూలీ ప్రపంచవ్యాప్తంగా 508 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల రూపాయల గ్రాస్.. 90 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X