Coolie Day 2 Box Office: రజనీకాంత్ కలెక్షన్ల సంచలనం.. 250 కోట్ల దిశగా కూలీ.. ఆ రికార్డులన్నీ బ్రేక్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున విలన్‌గా నటించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14వ తేదిన కూలీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..
కూలీ బడ్జెట్ ఎంత?
ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కూలీ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.350 కోట్ల భారీ బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఆంధ్రా, నైజాంలలో కూలీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు) వెచ్చించి కూలీ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలో కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ప్రపంచవ్యాప్తంగా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. భారీ అంచనాల నేపథ్యంలో కూలీ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
కూలీ తొలి రోజు కలెక్షన్స్:
గత కొద్దిరోజులుగా విశ్లేషకులు, ట్రేడ్ పండితుల అంచనా ఏమాత్రం తప్పలేదు. రజనీకాంత్ కూలీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 155 కోట్ల రూపాయల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తమిళనాడులో 30 కోట్ల రూపాయల గ్రాస్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 20 కోట్ల రూపాయల గ్రాస్, కేరళలో 10 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 12 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 8 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్ 80 కోట్ల రూపాయలు గ్రాస్.. 68 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో తొలి నుంచి డామినేషన్ చూపించిన రజనీకాంత్ మూవీకి ఫస్ట్ డే ఏకంగా 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో కలిపి కూలీకి తొలి రోజు రికార్డు స్థాయిలో 155 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ వసూళ్లతో విజయ్ దళపతి లియో ఓపెనింగ్స్ (146 కోట్ల రూపాయలు) రికార్డును రజనీకాంత్ బ్రేక్ చేశాడు.
కూలీ రెండో రోజు కలెక్షన్స్:
సెలవులు, వర్కింగ్ డే కావడంతో కూలీకి రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే ఆడియన్స్ పోటెత్తారు. సాయంత్రం 4 గంటల వరకు తమిళ వెర్షన్‌కు 64 శాతం, హిందీ వెర్షన్‌కు 31 శాతం, తెలుగు వెర్షన్‌కు 70 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. దీంతో రెండో రోజు కూలీ సినిమాకు తమిళనాడులో 25 కోట్లు, తెలుగులో 20 కోట్లు, కర్ణాటక, కేరళ, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 5 కోట్లు, ఓవర్సీస్‌లో 20 కోట్లు చొప్పున వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దీంతో కూలీకి రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 225 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











