Coolie Day 3 Box Office: 300 కోట్ల క్లబ్‌లోకి కూలీ.. రికార్డ్ వసూళ్లతో రజనీ సంచలనం

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సినిమాలూ విలన్‌గా నటించగా.. ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కూలీ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 3వ రోజు కూలీ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..

కూలీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా, నైజాంలలో కూలీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు) వెచ్చించి కూలీ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలో కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

Coolie Day 3 Expected Box Office Collections Worldwide rajinikanth film to cross 300 crores mile stone

వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర రజనీకాంత్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో లోకేష్ కనగరాజ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కూలీ రెండు రోజుల కలెక్షన్స్:
కూలీకి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 155 కోట్ల ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు 88 కోట్ల కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. రెండ్రోజుల వరకు తమిళనాడులో 82 కోట్ల రూపాయలు, హిందీలో 12 కోట్ల రూపాయలు, తెలుగులో 35 కోట్ల రూపాయలు, కన్నడంలో 6 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 120 కోట్ల కోట్ల రూపాయల నెట్.. 142 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌‌లో రజనీ కాంత్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో నార్త్ అమెరికా, సింగపూర్, మలేషియా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటి వరకు కూలీకి 105 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్+ ఓవర్సీస్ వసూళ్లు కలిపి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా కూలీ మూవీకి 122 కోట్ల రూపాయల షేర్.. 247 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో కూలీ వసూళ్లు
రజనీకాంత్ ఫాలోయింగ్‌కు తగిన విధంగానే తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్ల విధ్వంసం చూపిస్తోంది. తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 35 కోట్ల రూపాయలు రాబట్టింది. ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 13 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 3 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 4 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3 కోట్ల రూపాయలు, నెల్లూరులో కోటి రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. దీంతో లోకేష్ కనగరాజ్- రజనీకాంత్ మూవీకి రెండు రోజుల్లో 17 కోట్ల రూపాయల షేర్.. 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

కూలీ 3వ రోజు కలెక్షన్స్
వరుస సెలవులు, వీకెండ్ కావడంతో కూలీకి మూడో రోజు కూడా సాలీడ్ బుకింగ్స్ జరిగినట్లుగా నివేదికలు వస్తున్నాయి. శనివారం సాయంత్రం 5 గంటల వరకు తమిళ వెర్షన్‌లో 47 శాతం, హిందీ వెర్షన్‌లో 19 శాతం, తెలుగు వెర్షన్‌లో 42 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఈ లెక్కన 3వ రోజు కూలీకి తమిళంలో 25 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ+ హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 8 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో మూడు రోజుల్లోనే కూలీ 300 కోట్ల మార్క్ అందుకుని ఓవరాల్‌గా 320 కోట్ల గ్రాస్ రాబడుతుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X