Coolie Day 5 Box Office: 400 కోట్ల క్లబ్‌లో కూలీ.. రజనీకాంత్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను ఏషియన్ సునీల్ సుమారుగా 54 కోట్ల (జీఎస్టీతో కలిపి) రూపాయలు, కేరళ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 20 కోట్లు, ఉత్తర భారతం రైట్స్ 50 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 100 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా మొత్తం బిజినెస్ సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియాలో కూలీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే. ఈ చిత్రం తొలి రోజున అన్ని భాషల్లో కలుపుకొని 65 కోట్ల రూపాయల నెట్, రెండో రోజు 55 కోట్ల రూపాయలు, మూడో రోజు 40 కోట్ల రూపాయలు, 4వ రోజు 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో మొత్తంగా 193 కోట్లు వసూలు చేసింది. తమిళంలోనే 125 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. హిందీలో 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఓవర్సీస్‌లో 165 కోట్ల రూపాయలు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 390 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కూలీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను రాబట్టింది. నైజాంలో 16 కోట్ల రూపాయలు, ఆంధ్రా, సీడెడ్, ఉత్తరాంధ్రలో కలిపి ఈ సినిమా 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. ఇంకా 60 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక కూలీ 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం సుమారుగా 10 నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. తెలుగులో 3 కోట్ల రూపాయలు, తమిళంలో 6 కోట్ల రూపాయలు, కన్నడ, హిందీ, కేరళలో కలిపి 2 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఓవర్సీస్ కలెక్షన్లు 150 కోట్ల రూపాయలతో కలిపి ఈ చిత్రం 200 కోటల్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











