Coolie: కూలీకి ఆ దేశంలో గట్టి దెబ్బ..రజనీ మూవీ బిజినెస్ కష్టాలు
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.
కూలీ మూవీని టెక్నికల్‌గా చాలా రిచ్‌గా నిర్మించారు. హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో షూట్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించడానికి ఐమాక్స్ వెర్షన్‌లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు. కూలీ సినిమా రిలీజ్‌కు ముందే ప్రభంజనం క్రియేట్ చేస్తున్నది.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్‌ను ఏరియాల వారీగా గ్రాండ్‌గా ముగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఈ సినిమా పాటలు ట్రెండింగ్‌లోకి వచ్చి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అయితే సింగపూర్‌లో ఈ సినిమాకు భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. దాంతో ఆ దేశంలో బిజినెస్ ఇంకా చర్చల దశలోనే ఉంది. ఓ సమస్య కారణంగా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సింగపూర్‌లో ఎదురైన సమస్య ఏమిటి? బిజినెస్, కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం ఉందనే వివరాల్లోకి వెళితే..
సింగపూర్‌లో అతిపెద్ద సినిమా చైన్ థియేటర్స్ కాథే సినీ ప్లెక్సెస్ సంస్థ తమ సినిమా హాళ్లను మూసివేసింది. దాంతో కూలీ సినిమా రిలీజ్ విషయంలో ఇది భారీ దెబ్బ అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ థియేటర్లు తగ్గిన కారణంగా బిజినెస్ వ్యవహారంలో కూడా కోత పెట్టాలని డిస్టిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 4.5 కోట్లుగా కోట్ చేశారు. కానీ భారీ సంఖ్యలో థియేటర్లు తగ్గినందన 4 కోట్ల రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ బిజినెస్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే కూలీ బిజినెస్ వ్యవహారంపై అనేక రూమర్లు, గాసిప్స్ మీడియాలోను, సోషల్ మీడియాలో వస్తున్నందున వాటిపై సింగపూర్ మూవీస్ డిస్టిబ్యూటర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఎవ్వరికి ఇంకా ఇవ్వలేదు. సింగపూర్‌లో హంసినీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ హక్కులు చేజిక్కించుకొనే అవకాశం ఉంది. ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయం అధికారికంగా వెల్లడిస్తామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











