Coolie Advance Booking Collections: ఓవర్సీస్‌లో కూలీ అడ్వాన్స్ బుకింగ్ హంగామా .. కబాలి రికార్డులపై రజనీ గురి

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది.

ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు.

Coolie Movie Advance Booking Box Office

ప్రపంచవ్యాప్తంగా కూలీకి వార్ 2 సినిమా నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. ఐమాక్స్ థియేటర్లన్నీ వార్ 2 మూవీ ఎగురేసుకుపోయింది. ఈ సినిమా లేటేస్ట్ టెక్నాలజీ డీ బాక్స్, 4డీఎక్స్ వెర్షన్లలో రిలీజ్ అవుతున్నది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి తదితర దేశాల్లో ప్రారంభం కానున్నాయి. ఇంకా 16 రోజులకుపైగా ఉండగానే ఈ సినిమాపై ఏర్పడుతున్న అంచనాలు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

నార్త్ అమెరికాలో కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా మొదలయ్యాయి. ఈ సినిమా యూఎస్‌లో బాక్సాఫీస్ ఓపెన్ కాగా, కెనడాలో ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అ సినిమా సుమారుగా 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ప్రత్యాంగిరా సినిమాస్ వెల్లడించింది. ఈ సినిమాను 365 లోకేషన్లలో 815 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ సినిమా 600K డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

గతంలో రజనీకాంత్‌ నటించిన కబాలీ మూవీ వచ్చిన హైప్ ఈ సినిమాకు కనిపిస్తున్నది. ఆ సమయంలో యూఎస్ఏలో 2.7 మిలియన్స్ డాలర్లు వసూలు చేసింది. అయితే ఈ కలెక్షన్లను కూలీ ఆధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఈ మూవీ ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X