కర్ణాటకలో రజనీకాంత్ కూలి హిస్టరీ... కేజీఎఫ్ 2, లియో రికార్డు చెల్లాచెదురు
ఇండియాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి నెక్ట్స్ రాబోతున్న చిత్రం కూలి. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆగస్టు 14న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కాగా కర్ణాటకలో కూలి చిత్రం రికార్డు క్రియేట్ చేసిందని ట్రేడ్ లెక్కలు తెలుపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్ తో కూలి చిత్రం..
కూలి చిత్రాన్ని భారీ స్టార్ కాస్ట్ తో కోలీవుడ్ అగ్ర చిత్ర పరిశ్రమ సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించారు. ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షహిర్, శృతి హాసన్, అమీర్ ఖాన్, సత్య రాజ్, పూజా హెగ్దే వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఈ చిత్రానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇలా స్టార్ కాస్ట్, టాప్ టెక్నీషియన్లు పని చేయడంతో వారి రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.350 కోట్లు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు..
రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం కావడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. బుకింగ్స్ ఓపెన్ కాగానే యూఎస్ఏ, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలన్నీ కలుపుకొని ఓవర్సీస్ లో 1 మిలియన్ టికెట్స్ అమ్ముడు పోయాయని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో 9 కోట్ల వరకు రెవెన్యూ వచ్చిందని వెల్లడిస్తున్నారు.
బెంగళూరులో రికార్డ్..
కూలి చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ప్రారంభం అవడం విశేషం. అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో కర్ణాటకలోని బెంగళూరులో కూలి చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే 37 నిమిషాల్లోనే కూలి చిత్రానికి 10,000 టికెట్స్ అమ్ముడు పోవడం విశేషం. ఈ సిటీలో కేజీఎఫ్ 2 చిత్రం 45 నిమిషాల్లో 10 వేల టికెట్స్ ను అమ్మగలిగింది. లియో చిత్రానికి 50 నిమిషాలు పట్టింది. కానీ రజనీకాంత్ కూలి చిత్రానికి కేవలం 37 నిమిషాలు అది కూడా 66 షోల్లో బుకింగ్స్ జరగడం వివేషం. దీంతో బెంగళూరులో ఇప్పుడు రజనీదే పై చేయ్యి అయ్యింది. ఇంత త్వరగా బుకింగ్స్ కావడం వల్ల కన్నడ వెర్ష్ ను నుంచి బాక్సాఫీస్ వసూళ్లు కూడా భారీగానే అందుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కూలి ప్రీ రిలీజ్ బిజినెస్?
రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్ట్ నటించిన ఈ కూలి చిత్రానికి మంచి డిమాండ్ ఉంది. భారీ అంచనాలు నెలకొనడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.550 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











