Coolie Kerala Advance Booking: కేరళలో కూలి అరాచకం.. 1 గంట లోనే ఎన్ని కోట్లు వసూలైందో తెలుసా?
కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ కూలి. ఇండియాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. మరో 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ తాజాగా ఓపెన్ అయ్యాయి. కాగా నార్త్ అమెరికాలో ఇప్పటికే మంచిరెస్పాన్స్ దక్కుతుండగా, ఇక తాజాగా ఇండియాలో ముఖ్యంగా కేరళ స్టేట్ లో మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
కూలి చిత్రానికి కేరళలో భారీ రెస్పాన్స్..
రజనీకాంత్ సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ మంచి క్రేజ్ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఖైధీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం నుంచి వస్తున్న రజనీకాంత్ కూలి చిత్రం మరింతగా హైప్ నెలకొని ఉంది. కాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కేరళలో ఆడియెన్స్ ముందున్నారు. భారీ స్థాయిలో టికెట్స్ అమ్ముడు పోతున్నాయి.

బుక్ మై షోలో ఆన్ లైన్ ద్వారా బుకింగ్స్ ఓపెన్ చేసిన 1 గంట లోపే 1.2 లక్షల టికెట్స్ అమ్ముడు పోయాయి. ఇది కేవలం కేరళ స్టేట్స్ లో కూలి చిత్రం ప్రదర్శించబోతున్న షోకు సంబంధించిన రిపోర్ట్స్. ఓపెనింగ్ డేకు ఇప్పటికే కేరళలో 37 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. దీని నుంచి 1 గంటలోపే 2.3 కోట్ల రూపాయాల గ్రాస్ వసూల్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ స్థాయిలో టికెట్స్ అమ్ముడు పోవడంతో ట్రేడ్ వర్గాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ నెంబర్స్ పై ఆసక్తి నెలకొంది.
యూఎస్ఏలోనూ భారీగా బుకింగ్స్..
ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నార్త్ అమెరికా నుంచి 857కే డాలర్స్ ను సంపాదించింది. అంటే 7.51 కోట్ల రెవెన్యూ అందిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఆస్ట్రేలియా, మిగితా ఏరియాలను కలుపుకొని 1 మిలియన్ డాలర్స్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. అంటే 9 కోట్ల రూపాయలు వసూలైందని తెలుస్తోంది.
కూలి బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్?
రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ నటించిన కూలి చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. తెలుగు స్టేట్స్ లో కూలి చిత్రానికి థియేట్రికల్ రైట్స్ ద్వారా 53 కోట్ల రూపాయలు దక్కాయి. ఇక్కడ కూలి చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సునీల్ నారంగ్, సురేశ్ బాబు, దిల్ రాజ్ సొంతం చేసుకున్నారని సాక్ నిక్ తెలిపింది. ఇక మిగితా ఇండియాలోని మిగితా ప్రధాన భాషలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి 500 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందిని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల గ్రాస్ ను టార్గెట్ గా పెట్టుకుందీ చిత్రం. మున్ముందు ఎంత వసూల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











