Coolie Overseas Collections: పుష్ప 2 రికార్డు బ్రేక్ .. రిలీజ్‌కు ముందే కూలీకి 50 కోట్ల కలెక్షన్లు.. వరల్డ్
దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో నటించిన స్టార్స్ నికర ఆస్తుల విలువకు సంబంధించిన అంచనా వివరాల్లోకి వెళితే..
ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు. ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

యూఏఈలో రజనీ మానియా కొనసాగుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో పుష్ప 2 రికార్డును ఇంకా వారం రోజుల ముందే బ్రేక్ చేసింది. పుష్ప 2 చిత్రం అడ్వాన్స్ బుకింగ్ మొదలైన 48 గంటల తరవ్ాత 802 టికెట్లు అమ్మితే.. కూలీ మాత్రం అడ్వాన్స్ బుకింగ్ మొదలైన 24 గంటల్లోనే 9127 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం 527K అమెరికా డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు సమాచారాన్ని వెల్లడించారు.
కూలీ సినిమాను నార్త్ అమెరికాలో రిలీజ్ చేస్తున్న ప్రత్యాంగీరా సినిమాస్ యూఎస్ఏ, కెనడాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టి.. రజనీకాంత్ ముమ్మాటికి నవయువకుడు.. బాక్సాఫీస్ వద్ద నవ యువకుడే.. ఎలాంటి అనుమానం లేదు. ఇంకా ఐదు రోజులు ఉండగానే.. ఈ సినిమా నార్త్ అమెరికాలో 1.6 మిలియన్ డాలర్లు అంటే.. 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని వెల్లడించింది.
అయితే కూలీ సినిమాను నార్త్ అమెరికాలో సుమారుగా 488 లోకేషన్లలో 1450 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 63 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. తెలుగు వెర్షన్‌కు సంబంధించి 350k డాలర్లు, తమిళం వెర్షన్‌కు సంబంధించి 1.25 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, యూకే, ఐర్లాండ్ తదితర దేశాల్లో కూడా మంచి స్పందన కనిపిస్తున్నది. పలు దేశాల్లో ఇప్పటికే ప్రీ సేల్స్ మొదలుపెట్టాయి. ఇంకా కొన్ని దేశాల్లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇంకా 5 రోజులు ఉండగానే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 3.5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రిలీజ్ డేట్ వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు 60 కోట్లకుపైగానే ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











