Coolie USA Advance Booking: నార్త్ అమెరికాలో కూలి కలెక్షన్ల హవా.. రజనీ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇండియాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ కూలి. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం విశేషం. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. స్టార్ కాస్ట్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి USAలో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఇంకా రిలీజ్ కు సమయం ఉండగానే రికార్డు స్థాయిలో ప్రీసేల్స్ జరుగుతుండటం విశేషం. రీసెంట్ గా బుకింగ్స్ ఓపెన్ అవ్వగా హాట్ కేక్ లా టికెట్స్ అమ్ముడు పోతున్నాయి. ఈ క్రమంలో సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ వివరాల్లోకి వెళితే..

USAలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా..
కూలి చిత్రానికి USAలో మంచి స్పందన కనిపిస్తోంది. ఈ సందర్భంగా కూలి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 40,000లకు పైగా టికెట్స్ అమ్ముడు పోయాయని మేకర్స్ అధికారికంగా వెల్లడించడం విశేషం. ఈ లెక్కన కూలి చిత్రానికి ఇప్పటి వరకు 3.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూలైంది. ఇక కూలి చిత్రం విడుదల అవుతున్న రోజే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2 కూడా రిలీజ్ అవుతోంది. అయినప్పటికీ వార్ 2 కంటే కూలి చిత్రానికి నార్త్ అమెరికాలో ఎక్కువ రెస్పాన్స్ కనిపిస్తోందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Coolie Movie USA Advance Bookings

టోటల్ ఓవరీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా..
ప్రస్తుతం తెలుగు చిత్రాలకు ఓవర్సీస్ లోనూ భారీ రెస్పాన్స్ దక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక స్టార్ హీరోలు, మల్టీస్టారర్ ఫిల్మ్స్ కు ఒకింత ఎక్కువగానే స్పందన లభిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కూలి చిత్రానికి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అందిరిపోతున్నాయి. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, ఫిజీ, పాపువా న్యూ గినియా(PNG) వంటి ఏరియాల్లో ఆగస్టు 5 వరకు 1 మిలియన్ కు పైగా టెకెట్స్ అమ్ముడు పోయాయని ట్రేడ్ నిపుణుల అంచనా. ఈ లెక్కన 9 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందినట్టు తెలుస్తోంది.

కూలి ప్రీ రిలీజ్ బిజినెస్..
రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ నటించిన ఈ చిత్రానికి మంచి డిమాండ్ లభించింది. తెలుగు స్టేట్స్ లో థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.53 కోట్ల వ్యాపారం జరిగింది. సునీల్ నారంగ్, సురేశ్ బాబు, దిల్ రాజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు సాక్ నిక్ తెలిపింది. తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు, ఓవర్సీస్ ఇలా అన్ని కలుపుకొని 500 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ లెక్కలు తెలుపుతున్నాయి.

భారీ బడ్జెట్ తో కూలి..
కూలి చిత్రాన్ని కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ లో 350 కోట్ల రూపాయలతో నిర్మించింది. కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ తో పాటు పూజా హెగ్దే స్పెషల్ డ్యాన్స్ తో అలరించబోతుండటం విశేషం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. మంచి రెస్పాన్స్ కూడా సొంతమైంది. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X