Coolie USA and Overseas Collections: కూలీ అమెరికా, ఓవర్సీస్ కలెక్షన్లు.. రజనీ మూవీ వసూళ్ల సునామీ
దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో నటించిన స్టార్స్ నికర ఆస్తుల విలువకు సంబంధించిన అంచనా వివరాల్లోకి వెళితే..
ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు.

ఇక కూలీ సినిమా ప్రీ రిలీజ్, థియేట్రికల్ రైట్స్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ మూవీకి భారీ బజ్ ఏర్పడటంతో బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు నార్త్ అమెరికాలో బ్రహ్మండమైన ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమాను అమెరికాలో ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేసింది.
అయితే ఈ సినిమా గురించి నార్త్ అమెరికా డిస్టిబ్యూటర్ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కలెక్షన్లను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ కావడమే కాకుండా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తున్నది అని ప్రత్యాం్గీరా సినిమాస్ పేర్కొన్నది. ఇక యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కుతున్నదనే విషయం ట్రేడ్ రిపోర్టుల ద్వారా వెల్లడైంది.
నార్త్ అమెరికా అంటే.. కెనడా, అమెరికాలో ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతున్నది. ఉత్తర అమెరికాలో కూలీ ఫీవర్ చుట్టుముట్టింది. రెండు రోజుల్లో ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.ఇప్పటికే ఈ సినిమా4.6 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 40 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు సాధించింది అని పేర్కొన్నారు.
అలాగే ఓవర్సీస్‌లో మిగితా దేశాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మిడిల్ ఈస్ట్‌లో 2 మిలియన్ డాలర్లు, యూకే, యూరప్‌లో కలిపి 1.5 మిలియన్ డాలర్లు, మలేషియా, సింగపూర్‌లో కలిపి 1.2 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 500K డాలర్లు, శ్రీలంకలొ 160K డాలర్లు, న్యూజిలాండ్ 50 డాలర్లు, మిగితా దేశాల్లో 100k డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు 9 మిలియన్ డాలర్లు, రెండో రోజు 4 మిలియన్ డాలర్లు మొత్తంగా 13 మిలియన్ డాలర్లు అంటే.. 110 కోట్ల రూపాయలు మేర వసూళ్లు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











