Coolie Overseas Advance Booking: కూలీ అడ్వాన్స్ బుకింగ్ ప్రభంజనం.. రిలీజ్‌కు ముందే రజనీ రికార్డుల మోత

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది.

ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు.

Coolie Overseas Advance Booking Box offic

కూలీ చిత్రానికి ఓవర్సీస్‌లో భారీ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ సుమారుగా 25 మిలియన్ డాలర్ల మేర జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 27 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 235 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

2025 సంవత్సరంలో అత్యంత క్రేజీగా మారిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో పలు దేశాల్లో ప్రారంభమైంది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూకే, ఐర్లాండ్, యూరప్ దేశాలు, అలాగే గల్ఫ్ కంట్రీస్‌లో రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఇంకా రెండు వారాలు ఉండగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జైత్రయాత్రను మొదలుపెట్టింది.

ఉత్తర అమెరికాలో కూలీ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఇంకా 14 రోజుల వ్యవధి ఉండగానే.. ఈ మూవీ 1.2 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రీమియర్లకు 1 మిలియన్ డాలర్లు, తొలి రోజుకు 200K డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టింది.

ఇక ఆస్ట్రేలియాలో ఈ చిత్రానికి భారీగా రెస్సాన్ నమోదు అవుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ వద్ద 100000 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే సరికి సుమారుగా 3 లక్షల డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 2025 సంవత్సరంలో అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైన చిత్రంగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X