Coolie Business: చరిత్ర సృష్టించిన కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్.. రజనీ మూవీ థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లంటే?
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్‌ను ఏరియాల వారీగా ఫినిష్ చేస్తున్నారు. తాజాగా తెలుగు, ఓవర్సీస్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సంచలనంగా మారింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
కూలీ సినిమా రిలీజ్‌కు ముందే ప్రభంజనం క్రియేట్ చేస్తున్నది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.

కూలీ మూవీని టెక్నికల్‌గా చాలా రిచ్‌గా నిర్మించారు. హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో షూట్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించడానికి ఐమాక్స్ వెర్షన్‌లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. గతంలో రజనీకాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టాయి. అయినా కూలీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ఇండస్ట్రీలోని దిల్ రాజు, ఏషియన్ సునీల్ నారంగ్, నాగవంశీ, మైత్రీ మూవీస్, సురేష్ బాబు, నాగార్జున తదితరులు గట్టిగా పోటీపడ్డారు. చివరికి ఈ సినిమా హక్కులను ఏషియన్ సునీల్ సుమారుగా 44 కోట్ల రూపాయల మేరకు చేజిక్కించుకొన్నట్టు సమాచారం. రజనీకాంత్ సినిమా కెరీర్‌లో ఆంధ్రా, నైజాంలో రైట్స్ ఈ రేంజ్ అమ్ముడుపోవడం ఓ రికార్డుగా మారింది.
ఇక రజనీకాంత్ సినిమా ఓవర్సీస్ రైట్స్ కళ్లు చెదిరే రేటుకు అమ్ముడుపోవడం ఇండస్ట్రీ టాక్‌గా మారింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను విదేశాల్లో తమిళ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రముఖ సంస్థ చేజిక్కించుకొన్నది. నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా తదితర దేశాల ఈ సినిమా హక్కులు సుమారుగా 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. తమిళ సినిమాకు ఈ రేంజ్‌లో రైట్స్ అమ్ముడుపోవడం రికార్డు అని చెప్పుకొంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీగా టేబుల్ ప్రాఫిట్‌ను సొంతం చేసుకొంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఆకాశాన్ని అంటుకొనేంతగా అంచనాలు నెలకొని ఉన్నాయి. సినీ, బిజినెస్ వర్గాలే కాకుండా ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిట్ టాక్ వస్తే తక్కువలో తక్కువ 1000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇక ఆ తర్వాత ఏ రేంజ్‌లో కలెక్షన్లు ఉంటాయో ఊహించడం కష్టం అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











