Coolie Worldwide Business: కూలీకి రికార్డు బ్రేక్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రజనీ మూవీకి వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లంట

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్‌ను ఏరియాల వారీగా ఫినిష్ చేస్తున్నారు. తాజాగా తెలుగు, ఓవర్సీస్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సంచలనంగా మారింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

కూలీ సినిమా రిలీజ్‌కు ముందే ప్రభంజనం క్రియేట్ చేస్తున్నది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.

Coolie Pre Release Business Worldwide

కూలీ మూవీని టెక్నికల్‌గా చాలా రిచ్‌గా నిర్మించారు. హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో షూట్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించడానికి ఐమాక్స్ వెర్షన్‌లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు.

అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ సుమారుగా 700 కోట్ల రూపాయలు మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు రజనీకాంత్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ థియేట్రికల్ బిజినెస్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా లోకేష్ కనగరాజ్‌ను స్టార్ డైరెక్టర్‌గా మరోసారి రుజువు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు భారీ డిమాండ్ కనిపించింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం అగ్ర నిర్మాతలు, డిస్టిబ్యూటర్లందరూ పోటీ పడ్డారు. చివరకు ఏషియన్ ఫిలింస్, బన్నీ వాసు, దిల్ రాజు, డి సురేష్ బాబు కలిసి ఈ సినిమాను సుమారుగా 52 కోట్ల రూపాయల మేర చెల్లించి హక్కులను సొంతం చేసుకొన్నారు.

ఇక కూలీ సినిమా నార్త్ అమెరికా హక్కులను అమెరికాకు చెందిన ప్రత్యాంగిరీ సినిమాస్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో సుమారుగా 30 కోట్ల రూపాయలు ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకొన్నారు. ఈ బిజినెస్ లావాదేవీ మినిమమ్ గ్యారెంటీ పద్దతిలో వారు చేజిక్కించుకొన్నారు. గతంలో లియోకు 18 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. అయితే ఓవర్సీస్ రైట్స్ మొత్తం 75 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు సమాచారం.

ఇక కర్ణాటక, కేరళ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు సుమారుగా 20 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. ఇక నార్త్ ఇండియా రైట్స్ 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. తమిళనాడు హక్కులు 100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక రజనీకాంత్ నటించిన ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా హక్కులు రికార్డు స్తాయిలో 125 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక శాటిలైట్, ఆడియో రైట్స్ కూడా భారీగా అమ్ముడుపోయాయి. ఈ సినిమా రిలీజ్‌కు ముందే అన్ని రకాలుగా 600 నుంచి 700 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాల్లో టాక్ ప్రచారంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X