War vs Coolie: రజనీ - హృతిక్ మధ్య టగ్ ఆఫ్ వార్.. ఫస్ట్ డే ఛాంపియన్ ఎవరు? ఎన్ని కోట్లంటే?
భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల వార్ 2.. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలు ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున రిలీజ్ అవుతాయని బయటకు వచ్చిన్పటి నుంచి ఏం జరుగుతుందో? ఎలాంటి రిజల్ట్ వస్తుందో? అసలు థియేటర్లు సరిపోతాయా? ఏదైనా సినిమా వాయిదా పడుతుందా? ఎవరు వెనక్కి తగ్గుతారు? ఇలా రకరకాల ప్రశ్నలు తొలిచేశాయి. వీటన్నింటికి సమాధానం చెబుతూ కూలీ, వార్ 2 చిత్రాలు ఒకే రోజున రిలీజై భారీ కలెక్షన్స్ సాధించాయి. ఈ రెండింటిలో ఏ సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టిందో చూస్తే..
అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రెండు సినిమాలు రికార్డులు తిరగరాశాయి. రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్‌ల కూలీ చిత్రం ఇండియాలో తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపింది. అడ్వాన్స్ బుకింగ్‌లో మొత్తం 18 లక్షల టికెట్ల అమ్మకాలు జరిగి 38 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇందులో ఒక్క తమిళనాడులోనే 16 లక్షల టికెట్ విక్రయాలు జరిగి 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్ ప్రీ సేల్స్‌లో దళపతి విజయ్ లియో రికార్డును కూలీ కొట్టేలేకపోయింది. లియోకు ప్రీ సేల్స్ ద్వారా 46.1 కోటి రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. వార్ 2 విషయానికి వస్తే.. కూలీ కంటే ఈ సినిమా బాగా వెనుకబడింది. మొత్తం 13 లక్షల టికెట్లకు గాను అడ్వాన్స్ బుకింగ్‌లో 28 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్ట గలిగింది.

కూలీ తొలి రోజు కలెక్షన్స్:
రజనీకాంత్ ఫాలోయింగ్‌కు తోడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ కారణంగా కూలీకి తొలి రోజు కలెక్షన్ల వర్షం కురిసింది. అందరూ ఊహించినట్లుగానే కూలీ ఫస్ట్ డే 155 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది. తమిళనాడులో 30 కోట్ల రూపాయల గ్రాస్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 20 కోట్ల రూపాయల గ్రాస్, కేరళలో 10 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 12 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 8 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్ 80 కోట్ల రూపాయలు గ్రాస్.. 68 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో తొలి నుంచి డామినేషన్ చూపించిన రజనీకాంత్ మూవీకి ఫస్ట్ డే ఏకంగా 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో కలిపి కూలీకి తొలి రోజు రికార్డు స్థాయిలో 155 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ వసూళ్లతో విజయ్ దళపతి లియో ఓపెనింగ్స్ (146 కోట్ల రూపాయలు) రికార్డును కూలీ బద్ధలు కొట్టింది.
వార్ 2 తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల వార్ 2 చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్త తడబడింది. ఈ సినిమాకు 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించగా కేవలం 85 కోట్ల రూపాయల వద్దే చాప చుట్టేసింది. హిందీలో 30 కోట్ల రూపాయలు.. ఆంధ్రా, తెలంగాణలలో 25 కోట్ల రూపాయలు, కర్ణాటక+ తమిళనాడు+ కేరళ+ రెస్టాఫ్ ఇండియాలలో కలిపి 5 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా ఫస్ట్ డే అక్కడ 25 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దీంతో వార్ 2కి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
కూలీయే ఛాంపియన్
వార్ 2, కూలీల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైనప్పటి నుంచి రజనీకాంత్ మేనియా కొనసాగింది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్‌లోనూ తలైవా ర్యాంపేజ్ చూపించారు. రిలీజ్ రోజు రివ్యూలు, మౌత్ టాక్ ఆధారంగా కూలీ బుకింగ్స్ పెరగడంతో రజనీకాంత్ సినిమాకు మాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో కూలీ కంటే వార్ 2 ఏకంగా 70 కోట్ల రూపాయలు వెనుకబడింది. మొత్తంగా ఫస్ట్ డే ఓపెనింగ్స్‌లో రజనీ ఛాంపియన్‌గా నిలిచారు. లాంగ్ రన్‌లో కూలీ, వార్ 2 చిత్రాలలో ఏది ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











