Couple Friendly Box Office Collections: డీసెంట్‌గా కపుల్ ఫ్రెండ్లీ వసూళ్లు.. బాక్సాఫీస్ కలెక్షన్లు కోట్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, అజయ్ కుమార్ పీ నిర్మించిన తాజా లవ్ అండ్ రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly). యువ హీరో, హీరోయిన్లు సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్ఫించింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, యోగిబాబు, గోపరాజు తదితరులు నటించారు.
ప్రేమికుల రోజున టార్గెట్ చేసుకొని వస్తున్న ఈ ప్రేమ కథా చిత్రానికి దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రఫిని, ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్, గణేష్ శివ ఎడిటింగ్ బాధ్యతలను అందించారు. ఈ సినిమాకు మైఖేల్ ఆర్ట్ విభాగం, దినేష్ మనోహరన్ క్యాస్టూమ్ డిపార్ట్‌మెంట్ పనులను పర్యవేక్షించారు. వాలంటైన్స్ డే రోజు కానుకగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వసూలైన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కపుల్ ఫ్రెండ్లీ సినిమా కథ విషయానికి వస్తే.. నిరుద్యోగులైన ఇంటీరియర్ డిజైనర్ శివ (సంతోష్ శోభన్), సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మిత్ర చెన్నైలో అనుకోకుండా కలుసుకొంటారు. ఆ పరిచయం కాస్త ఆఫైర్‌గా మారుతుంది. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో సహజీవనం చేస్తుంటారు. వీరి లివింగ్ టుగెదర్ వ్యవహారం ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. ఆ పరిస్థితుల్లో మిత్రను విధి మరో రకంగా వెంటాడుతుంది. ఆ పరిస్థితుల్లో శివ ఏం చేశాడనేది సినిమా కథ.
యూత్‌ఫుల్, లవ్ స్టోరితో ఎమోషనల్ డ్రామాగా డిఫరెంట్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఫీల్‌గుడ్‌గా రూపొందించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లతో కలిపి ఈ మూవీని సుమారుగా 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులు 1 కోటి రూపాయలు ఖర్చు చేసింది. దాంతో ఈ సినిమా వ్యయం సుమారుగా 7 కోట్ల రూపాయలు అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని తెలిపారు.
ఇదిలా ఉంటే.. కపుల్ ఫ్రెండ్లీ సినిమా చూసిన యువ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనే కాకుండా సినీ నిర్మాణంలో వరుస సక్సెస్ సాధిస్తున్న ధీరజ్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో భారీగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలంగాణలో 400 షోలు, ఆంధ్రాలో 600 షోలు, కర్ణాటకలో 125 షోలు ప్రదర్శించినట్టు ట్రేడ్ రిపోర్ట్.
ఇక కపుల్ ఫ్రెండ్లీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రీమియర్లు 13వ తేదీన గ్రాండ్‌గా ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్ల ద్వారా సుమారుగా 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. బెంగళూరు, హైదరాబాద్‌లో మంచి క్రేజ్ ఆడియెన్స్ నుంచి కనిపించింది. ఇక తొలి రోజు వసూళ్లు భారీగానే నమోదు అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ 1.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. తమిళ వెర్షన్‌కు భారీ క్రేజీగా ఉంది. ఈ సినిమాకు తమిళంలో 1.5 కోట్లకుపైగా రాబడుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











