Couple Friendly Box Office: కపుల్ ఫ్రెండ్లీ కలెక్షన్ల జోరు.. చిన్న సినిమాకు భారీగా.. వసూళ్లు ఎన్ని కోట్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, అజయ్ కుమార్ పీ నిర్మించిన తాజా లవ్ అండ్ రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly). యువ హీరో, హీరోయిన్లు సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్ఫించింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, యోగిబాబు, గోపరాజు రమణ తదితరులు నటించారు.
ప్రేమికుల రోజున టార్గెట్ చేసుకొని వస్తున్న ఈ ప్రేమ కథా చిత్రానికి దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రఫిని, ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్, గణేష్ శివ ఎడిటింగ్ బాధ్యతలను అందించారు. ఈ సినిమాకు మైఖేల్ ఆర్ట్ విభాగం, దినేష్ మనోహరన్ క్యాస్టూమ్ డిపార్ట్‌మెంట్ పనులను పర్యవేక్షించారు. వాలంటైన్స్ డే రోజు కానుకగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వసూలైన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

యూత్‌ఫుల్, లవ్ స్టోరితో ఎమోషనల్ డ్రామాగా డిఫరెంట్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఫీల్‌గుడ్‌గా రూపొందించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లతో కలిపి ఈ మూవీని సుమారుగా 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులు 1 కోటి రూపాయలు ఖర్చు చేసింది. దాంతో ఈ సినిమా వ్యయం సుమారుగా 7 కోట్ల రూపాయలు అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని తెలిపారు.
కపుల్ ఫ్రెండ్లీ సినిమా పాజిటివ్ టాక్‌తో తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ముందుకెళ్తున్నది. గతవారం రిలీజైన చిత్రాల్లో ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకొంటున్నది. దాంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేస్తూ చిత్ర యూనిట్‌లో జోష్ పెంచింది. ఓపెనింగ్స్ భారీగా రావడంతో హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో ప్రత్యక్షంగా ప్రేక్షకులను కలుసుకొనే యాత్రను నిర్వహిస్తున్నారు.
తమిళ వాతావరణం నేపథ్యంగా తెలుగు ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రీమియర్లను ఫిబ్రవరి 13వ తేదీన ప్రదర్శించారు. ఈ సినిమా ప్రీమియర్లకు 10 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి. ఈ సినిమా తొలి రోజు 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు కూడా ఈ మూవీ నిలకడగా వసూళ్లను సాధిస్తూ 1.4 కోట్ల రూపాయలను రాబట్టింది. మూడో రోజు ఈ సినిమా 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో తెలుగు వెర్షన్ మూడు రోజుల్లో 3.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళంలో ఈ సినిమా అంత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురుతున్నది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు 25 లక్షల రూపాయలు, రెండో రోజు 20 లక్షల రూపాయలు, మూడో రోజు 15 లక్షల రూపాయలు, వసూలు చేసింది. గత మూడు రోజుల్లో 60 లక్షల రూపాయలు కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక నాలుగో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. వర్కింగ్ డే రోజుల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్లను సాధిస్తున్నది. నాలుగో రోజు ఈ చిత్రం 80 లక్షల రూపాయలు వసూలు చేయవచ్చు. తమిళంలో 20 లక్షల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా నాలుగో రోజున 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా తెలుగు, తమిళంలో కలిపి 5.35 కోట్ల రూపాయలు మేర వసూళ్లను సాధించవచ్చు అని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











