OTT: తండేల్ మూవీతో నాగ చైతన్య జాక్ పాట్.. 80 కోట్ల బడ్జెట్.. ఆ ఓటిటి సంస్థ క్రేజీ ఆఫర్
ప్రెజెంట్ తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి హీరోస్ ని మన వాళ్ళు టైర్ 1, టైర్ 2 అలాగే టైర్ 3 అంటూ విభజించుకుని ఆయా హీరో మార్కెట్ ఆధారంగా ఒకొక్కరిని ఒకో టైర్ లో పెట్టుకున్నారు. మరి టైర్ 1 లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్స్ ఉంటే టైర్ 2 లో రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని ఇంకా నితిన్ అక్కినేని నాగ చైతన్య లాంటి స్టార్స్ వస్తారు.. అని వాళ్ళే పెట్టుకున్నారు.
కాగా ఈ లిస్ట్ లో ఉన్నటువంటి హీరోస్ లో గట్టి పోటీ ఇప్పుడు కనిపిస్తుంది. ప్రస్తుతం వారి సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లు ఒకదాన్ని మించి ఒకటి ఓ రేంజ్ లో జరుగుతూ వెళుతున్నాయి. కాగా తాజాగా నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం "తండేల్" కోసం ఇప్పుడు సినీ వర్గాల్లో క్రేజీ వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య దీనికి ముందు చేసిన సినిమాలు థ్యాంక్ యు, కస్టడీ లు భారీ డిజాస్టర్ లు అయ్యాయి.

అయినా కూడా ఇప్పుడు తండేల్ సినిమా బడ్జెట్టు సుమారు 80 కోట్లుగా అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఇపుడు ఈ బడ్జెట్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకి భారీ బిజినెస్ జరుగుతున్నట్టుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇందులో సగం బడ్జెట్ కేవలం ఓటిటి మూలానే వచ్చేసినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమా వరల్డ్ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఏకంగా 40 కోట్లు పెట్టి కొనేసిందట.
ఇక్కడే సినిమా బడ్జెట్ లో సగం వచ్చేసింది అని చెప్పాలి. ఇక హిందీ డబ్బింగ్ అని ఆడియో హక్కులని చూసుకుంటే అవి ఇంకో 20 కోట్ల మేర ఉంటాయని టాక్. ఇలా కేవలం నాన్ థియేట్రికల్ హక్కులు తోనే తండేల్ 90 శాతం బడ్జెట్ ని రాబట్టేసింది. ఇక మిగతా అంతా థియేట్రికల్ గా చేసే పెర్ఫామెన్స్ బట్టి ఉంటుంది అని చెప్పాలి.

కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు "కార్తికేయ 2" ఫేమ్ చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా ఈ సినిమాకి అన్ని రకాలుగా కావాల్సినంత హైప్ ఇచ్చే అంశాలు ఉండడం బాగా ప్లస్ కాగా దీనికి అదనంగా మరో అంశం కూడా ఉందని చెప్పాలి. నాగ చైతన్య థియేట్రికల్ గా గత ఏడాది ప్లాప్ అయినప్పటికే గత ఏడాది ఓటిటిలో వచ్చిన తన వెబ్ సిరీస్ "దూత" పెద్ద హిట్ అయ్యింది.
ఈ ఎఫెక్ట్ చైతు వరకు బాగా పని చేసిందట దీనితో తండేల్ కి ఇంత మంచి మార్కెట్ జరగడానికి ఉన్న కారణాల్లో దాని పుణ్యం కూడా ఉందని చెప్పాలి. కాగా ఈ చిత్రం శ్రీకాకుళం - పాకిస్తాన్ లైన్ పై తెరకెక్కిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ ని తప్పించుకొని వచ్చే ఏడాది విడుదల కానున్నట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి


Click it and Unblock the Notifications











